Share News

UK: రిషి సునాక్‌పై జాత్యాహంకార వ్యాఖ్యలు.. పాకీ అంటూ రెచ్చిపోయిన నేత!

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:07 PM

తనను పాకీ అంటూ రిఫార్మ్ పార్టీ నేత సంబోధించడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతుళ్లు ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.

UK: రిషి సునాక్‌పై జాత్యాహంకార వ్యాఖ్యలు.. పాకీ అంటూ రెచ్చిపోయిన నేత!

ఇంటర్నెట్ డెస్క్: తనను పాకీ అంటూ రిఫార్మ్ పార్టీ నేత సంబోధించడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతుళ్లు ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు. దక్షిణాసియాకు చెందిన వారిని కొందరు జాత్యాహంకారులు పాకీ అని నిందాపూర్వకంగా పిలుస్తుంటారు. ప్రస్తుతం ఈ ఉదంతం వైరల్ గా (NRI) మారింది.

ఈ ఘటనై మీడియా ముఖంగా రిషి సునాక్ స్పందించారు. ‘‘ఈ వ్యాఖ్యలు నా మనసును గాయ పరిచాయి. ఆగ్రహం తెప్పి్స్తున్నాయి. రిఫార్మ్ పార్టీ నేతలు, ప్రచారకులు తమ ప్రశ్నించే వారే లేరన్నట్టు ఇలాంటి జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆ పార్టీ సంస్కృతి ఎలాంటిదో అర్థమవుతోంది’’ అని రిషి సునాక్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు (Rishi Sunak Hurt After Right Wing Party Calls Him Paki).

NRI: డాలస్‌లో మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం


ఘటనపై రీఫార్మ్ పార్టీ అధినేత నైజెల్ ఫరాజ్ కూడా స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీలో కొందరి తీరు నిరుత్సాహపరిచేలా ఉందని వ్యాఖ్యానించారు. అలాంటి నేతల కామెంట్స్ పార్టీకి, దాని మద్దతుదారులను ప్రతిబింబించదని స్పష్టం చేశారు.

వలసలను అడ్డుకోవడమే ఎజెండాగా ఎన్నికల్లో దిగిన రీఫార్మ్ పార్టీ.. అభ్యర్థుల ఎంపికలో తడబాటుకు లోనవుతోంది. జాత్యాహంకార వ్యతిరేక సంస్థ హోప్ నాట్ హేట్ ప్రకారం, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 166 మంది నేతల అభ్యర్థిత్వాన్ని పార్టీ ఉపసంహరించుకుంది. వీరిలో చాలా మంది జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు.

కాగా, రీఫార్మ్ పార్టీకి మద్దతు పలికితే లేబర్ పార్టీకి జైకొట్టినట్టేనని రిషి సునాక్ ఓటర్లను హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల చర్యలే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి కారణమన్న నైజెల్ వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. ఇలాంటి కమెంట్స్‌తో రష్యా అధ్యక్షుడిని ప్రోత్సహించినట్టు అవుతుందని హెచ్చరించారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 05:07 PM