Share News

NRI: ఆప్యాయత, అనురాగంతో రియాధ్‌లోని తెలుగు దినోత్సవం

ABN , Publish Date - Sep 26 , 2024 | 03:33 PM

బలీయమైన అరబ్బు తెగల సంప్రదాయానికి నెలవయిన సౌదీలోని మధ్యప్రాంతంలో నిండు తెలుగుతనంతో అంగరంగ వైభవంగా తెలుగు భాషా దినోత్సవం పేర జరిగిన తెలుగు ఆత్మీయ సమ్మేళనంతో ప్రవాసీ తెలుగు కుటుంబాలలో అనురాగం, అప్యాయత వెల్లివిరిసింది.

NRI: ఆప్యాయత, అనురాగంతో రియాధ్‌లోని తెలుగు దినోత్సవం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: బలీయమైన అరబ్బు తెగల సంప్రదాయానికి నెలవయిన సౌదీలోని మధ్యప్రాంతంలో నిండు తెలుగుతనంతో అంగరంగ వైభవంగా తెలుగు భాషా దినోత్సవం పేర జరిగిన తెలుగు ఆత్మీయ సమ్మేళనంతో ప్రవాసీ (NRI) తెలుగు కుటుంబాలలో అనురాగం, అప్యాయత వెల్లివిరిసింది.

ఉదయం నుండి రాత్రి వరకు తెలుగు ప్రవాసీ సంఘం ‘సాటా’ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా కొనసాగిన కార్యక్రమంలో రాజధాని రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీయుల కుటుంబాలు అనేకం పాల్గొన్నాయి. ఉపాధి రీత్యా సౌదీ అరేబియాకు వచ్చిన అనేక తెలుగు కుటుంబాలకు ఈ కార్యక్రమం సొంత ఊరిలోని జాతరగా కనిపించింది. గత కొన్నాళ్ళుగా సౌదీలో ఉంటున్న తమకు ఈ రకమైన తీపి తెలుగుతనం లభిస్తుందనుకోలేదని ప్రప్రథమంగా పాల్గొన్న జగిత్యాల జిల్లాకు చెందిన శ్రావణి వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి వచ్చిన వందలాది మంది తెలుగు ప్రవాసీయులందరు తమకు భాషా బంధువులంటూ వారికి భోజనాలు వడ్డీంచారు. బాపట్ల జిల్లా సుబ్బారెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఆరాధ్య భవనం, ధాయత్రి భవనం అనే ఇద్దరు చిన్నారి అక్కాచెళ్ళెలు.

2.jpgNRI: ప్రతిభకు జేజేలు! తానా బ్యాడ్మింటన్‌ పోటీలు విజయవంతం


ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ ఎంబసీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి మోహమ్మద్ షారీఖ్ బదర్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం భారతీయతను ప్రతిబింబిస్తుందని, విదేశీగడ్డపై భారతీయులకు తమ సంస్కృతి విలువలను పరిరక్షించడం ఆనందకరమని అన్నారు. ప్రవాసీయుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు.

మరో సీనియర్ దౌత్యవేత్త పవన్ కుమార్ తెలుగు సంస్కృతిని ప్రశంసించారు. ఎడారులలో చిక్కుకుపోయి విలవిల్లాడే తెలుగువారితో సహా ఇతర భారతీయులను కూడా సౌదీ అరేబియా ప్రభుత్వ సహాయంతో కాపాడే ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్దీఖ్ తువూరును ఈ సందర్భంగా సాటా సభ్యులు సన్మానించారు. అదే విధంగా మృతదేహాల తరలింపులో సహకరించే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఫారూఖ్‌ను కూడా ఈ సందర్భంగా నిర్వాహకులు సన్మానించారు.

మొత్తం గల్ఫ్ దేశాల కూటమి జి.సి.సిలో అతి పెద్ద దేశమైన సౌదీ అరేబియాలో తెలుగు ప్రవాసీ సంఘం సాటా అగ్రగామి తెలుగు సంఘం కాగా దీనికి రియాధ్ గుండేకాయ లాంటిది. రియాధ్‌లో ప్రతి సంవత్సరం జరిగే ఈ ప్రతిష్ఠాత్మక ఆత్మీయ సమ్మేళనానికి ప్రాముఖ్యత ఉంది.

3.jpgNRI: తానా కళాశాల పరీక్షలు విజయవంతం


సాటా ముఖ్యులు ఆనందరాజు, ముజ్జమ్మీల్, రంజీత్, ఆనంద్ పోకూరి, పవన్, సత్తిబాబు, ప్రశాంత్ లోకే, గోవిందరాజు, వంశీ, నాగార్జున, నరేంద్ర, సూర్య, వినయ, ఎర్రన్న, వెంకటేశ్, సుధీర్, జానీ శేఖ్, శ్రీకాంత్, మహిళల పక్షాన అక్షిత, అర్చన, భారతీ దాసరి, భారతి వీరపల్లి, శ్రీదేవి, సింధూర, శిల్పా, సుచరిత, సుధా, పావని శర్మ, మాధవి గుంటి, లక్షి మాధవి, లక్ష్మి కాకిమని, గీతా శ్రీనివాస్, చందన తనకాల, రమ్య శ్రీ, ఉషా, శ్వేతలు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను చేపట్టారు.

సాటా ప్రముఖులు రంజిత్, సత్తిబాబు, ఆనంద్ పోకూరి, చేతన, భారతీ విర్యపల్లిలు జ్యోతి ప్రజ్వలన చేయగా మానస వినాయకపూజ, ముదస్సీర్ శేఖ్ ఖురాన్ పఠనం, మానస్ బైబిల్ ప్రవచనాలు వినిపించారు.

సాటా రియాధ్ అధ్యక్షులు ఆనందరాజు గుండబోయిన, మహిళా విభాగం అధ్యక్షురాలు సుచరితలు స్వాగతోపన్యాసం ఇచ్చారు. చందన వేదిక వద్ద అతిథులకు ఆహ్వనం పలికారు.

సందర్భానుసారం తమ వాగ్ధాటితో చేతన, కాకుమని లక్ష్మి, ఉషా, లక్ష్మి మాధవిలతో పాటు శివారెడ్డి, తారక్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

సభా వేదిక అలంకరణను తమ వినూత్న అలోచనలకు అనుగుణంగా శ్వేత రియాజోద్దీన్, రమ్య శ్రీ, సుబ్రమణ్యం, సుచరిత కందులలు చేయగా అనేక మంది వేదికపైకి వచ్చి ఫొటోలు తీసుకున్నారు.

4.jpgNRI: తెలంగాణ సీఎంకు గల్ఫ్ టీపీసీసీ, దుబాయి అంబేద్కర్ సంఘం కృతజ్ఞతలు


చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. ఉదయం నుండి రాత్రి వరకు చిన్నారులు ప్రదర్శించిన 75కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు అందర్ని ఆకట్టుకున్నాయి. నృత్యం, నాటకం, సంగీతం మేళవింపుతో సమాహార కళగా సభికులు వీటిని ఆస్వాదించారు.

విశాఖపట్టణానికి చెందిన దాసరి భారతి నేతృత్వంలో జాతీయ ఉద్యమ నాయకులుగా చిన్నారులు సంకల్ప్ కేసరి, శ్వస్వత్ కేసరి, కార్తికేయ వన్నడ, మనస్ దుగ్గపు, ముదస్సీర్ శేఖ్, హేం నిఖిల్ చింతలపూడి, హంసినీ హితేషి దొంతిరెడ్డి, సాన్విక మందడిలు ప్రదర్శించిన జాతీయ స్ఫూర్తి ప్రదర్శన సభికులను అలోచింపజేయగా కొందరు కన్నీరు పెట్టుకున్నారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శించే భారతీయతే ఈ ప్రదర్శన ఉద్దేశమని భారతి పేర్కొన్నారు.

డాక్టర్ హారిక కాలగర్ల దర్శకత్వంలో జరిగిన మా తెలుగు తల్లికి మల్లెపూల గేయ పఠనం, ప్రదర్శనలో చిన్నారులు ధన్వీ బోగినేని, స్రవంతి యసరపు, భారతీ చెల్లూరి, జయసింగ్‌లు తమ అత్యున్నత ప్రతిభను కనబరిచారు. ఉషా, శిల్పాల దర్శకత్వంలో జరిగిన తెలుగు మహనీయుల ప్రదర్శనలో అభినవ్, అద్విత్, చెర్విత శ్రీసాయి, హేమకేశ్, కార్తికేయ, అతిరథ్ బిల్లా, రుచీత అన్నీ, శ్లోకా, లోకే శౌర్య, సూర్య కృష్ణా రెడ్డి, యువన్ చిట్లూరిలు చూడముచ్చటగా చూపరులను ఆకుట్టుకున్నారు. ప్రతి సంవత్సరం తరహా ఈసారి కూడా చిన్నారి హానిషా తన కూచిపూడి నృత్యంతో సభికులను ఆకట్టుకుంది.

5.jpgNRI: తెలంగాణ సీఎంకు గల్ఫ్ టీపీసీసీ, దుబాయి అంబేద్కర్ సంఘం కృతజ్ఞతలు


అదే విధంగా, భారతీయ ప్రాచీన సాంస్కృతిక ప్రదర్శనలలో వైదేహి బృందం ప్రదర్శించిన నృత్యాలలో అక్షయ, వేదా, కార్తీక, శరణ్యల నృత్యాలు భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించింది. భారతీ, అర్చనల ఆధ్వర్యంలో జరిగిన శాస్త్రీయ నృత్యాలు శివరాత్రి బ్రహ్మత్సోవాలు లేదా దేవినవరాత్రులను మరిపించాయి. 1400 కిలోమీటర్ల దూరంలోని తబూక్ నుండి వచ్చిన హారిప్రియా, అమె కూతురు ధిత్రి ప్రదర్శించిన కృష్ణలీల ప్రదర్శనను రసానుభూతితో అలరించింది.

మైమరిపించిన హులహూప్ కార్యక్రమాన్ని తిశిథ ప్రదర్శించగా సింధూ, చేతన, శ్రీదేవిల దర్శకత్వంలో జరిగిన టాలివూడ్ ధమకా సభికులలో ఉత్సహం రెట్టింపు చేసింది. పోల్ స్టార్స్ బృందంలో పావని శర్మ, మాధవి, బాలులు చేసిన నృత్యాలు కూడా నచ్చాయి. మారుతున్న కాలానికి అనుగూణంగా వైవిధ్య కళల ప్రదర్శనలో భాగంగా సుధా ప్రశాంత్, శ్వేత రియాజోద్దీన్, భారతీ దాసరి, జయచందన్లు ప్రదర్శించిన పాశ్చాత్య నృత్యాలు సభికులను కొద్దిసేపు పారిస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ తరహా లెబనాన్ రాజధానికి తీసుకెళ్ళాయి.

సినీ గేయాల పోటీలకు గీతా శ్రీనివాస్, లక్షి మాధవిలు న్యాయనిర్ణేతలుగా వ్యవహారించారు. పాడిన వారందరిలో కూడా సంగీత ప్రావీణ్యత ఉండడంతో ఉత్తములుగా ఎంపిక చేయడం అంత సులువు కాదని గీతా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. సౌదీలో గాన గంధర్వుడిగా పేరొందిన జెద్ధాలోని అంజద్ హుస్సేన్, గోపిలకు తోడుగా రియాధ్‌లోని జగదీష్ నీలంరాజు తమ పాటలతో ప్రేక్షకులను అలరించగా రియాధ్ నగరంలో గాత్రధారిగా ప్రాచుర్యం పొందుతున్న విజయవాడకు చెందిన మానస కందగరి కూడా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. మానస గతంలో రేడియో మిర్చిలో పని చేసి ప్రస్తుతం సౌదీలో తన భర్త సమీర్‌తో కలిసి ఉంటున్నారు.

6.jpgNRI: భారతీయ పాఠశాల సమస్యలపై చర్చించిన గ్లోబల్ ఇండియన్!


అల్ ఖోబర్ నుండి వచ్చిన సాటా మహిళ విభాగం అధ్యక్షురాలు సంధ్య నేతృత్వంలో ప్రవీణా, జయ శ్రీ, నవ్య, సౌజన్య, జాహ్నవి, ప్రియా, హరిత, రజనీ మరియు రాధలు మహిళల హక్కులు, ఆత్మ రక్షణ, స్వావలంబన మొదలగు ఆంశాలపై ప్రదర్శించిన సృజనాత్మక ప్రదర్శన వర్తమానంలో భారతావనిలో మహిళల పరిస్థితికి దర్పం పట్టింది.

అల్ భోబర్‌లోని తెలుగు రుచుల భోజనాలను వడ్డించగా పవన్, నిజామొద్దీన్, టీవీపీ రాజేశ్ భోజన ఏర్పాట్లను సమన్వయం చేసారు. కార్యక్రమానికి భువనేశ్వరి రియల్ ఎస్టేట్, గూగీ ప్రాపర్టీస్, ఫైన్ ఏకర్స్, పటేల్ రైస్, అల్ రాజీ బ్యాంకింగ్, అల్ కబీర్, జరీర్ మెడికల్ సెంటర్, కింగ్స్ హెల్త్, వివర్త మ్యూచువల్ ఫండ్స్, లూలూ గ్రూప్, బిరేన్ వాటర్ తదితరులు ప్రయోజితులుగా వ్యవహారించారు. వీరికి తోడుగా గుంటూరు జిల్లాకు చెందిన లింగంపల్లి సుబ్రమణ్యం, కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ గౌడ్‌లు కూడా తమ తోడ్పాటందించారు. ఈ సందర్భంగా సాటాకు అండగా నిలిచిన సౌదీలో సాప్ సాఫ్ట్‌వేర్ పితామహుడిగా పేరొందిన విశాఖపట్టణానికి చెందిన కోరుపోలు సూర్యరావు (సూర్య)కు సాటా కుటుంబాలన్నీ కూడా కలిసి ఆత్మీయ వీడ్కోలు పలికాయి.

7.jpg8.jpg9.jpg10.jpg15.jpg16.jpg11.jpg12.jpg13.jpg14.jpg1.jpg

Read Latest and NRI News

Updated Date - Sep 26 , 2024 | 05:33 PM