NRI: సేవా ఇంటర్నేషనల్ అట్లాంటా చాప్టర్ వార్షిక గాలా ఈవెంట్ విజయవంతం!
ABN , Publish Date - Dec 15 , 2024 | 06:03 PM
సేవా ఇంటర్నేషనల్, అట్లాంటా చాప్టర్ నిర్వహించిన వార్షిక గాలా కార్యక్రమం విజయవంతమైంది. సంస్థ చేపట్టబోయే వివిధ సేవా కార్యక్రమాలకు దాతలు 5.4 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: సేవా ఇంటర్నేషనల్, అట్లాంటా చాప్టర్ నిర్వహించిన వార్షిక గాలా కార్యక్రమం విజయవంతమైంది. డిసెంబర్ 7న ట్వెల్వ్ మిడ్‌టౌన్ ఆటోగ్రాఫ్ కలెక్షన్ వేదికగా జరిగిన ఈ సమ్మేళనంలో అట్లాంటా చాప్టర్ సభ్యులు తాము నిర్వహించిన సేవా కార్యక్రమాలు వివరించారు. తదుపరి చేపట్టబోయే వివిధ సేవా కార్యక్రమాలకు 5.4 లక్షల డాలర్లు నిధులు సేకరించారు. ఈ సమ్మేళనానికి పలువురు ప్రముఖులు, స్థానిక భారతీయ నేతలు వలంటీర్లు కలిపి మొత్తం 250 మంది అతిథులు హాజరయ్యారు (NRI).
NRI: ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో ఎన్నారైల ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం
ఎన్నారై ప్రముఖులు సోఫీ ముఖర్జీ, నట్వర్‌లాల్ పటేల్, డా. జగదీశ్ శేఠ్, డా, రఘు గ్రండిగె, విశాల్ ఖేరా ద్వీప ప్రజ్వలనతో ఈ సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం అట్లాంటా చాప్టర్ అధ్యక్షులు డా. మాధవ్ దర్భ, ఉపాధ్యక్షులు రాజ్ రాధాకృష్ణన్.. ఈ సంవత్సరం సంస్థ చేపట్టిన వివిధ సేవాకార్యక్రమాలను సభికులకు వివరించారు. చిన్నారులకు విద్యనందించేందుకు ఉద్దేశించిన సేవా అమెరికోర్ ఆఫ్టర్‌స్కూల్ ట్యూటరింగ్ ప్రోగ్రామ్, జార్జియా అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా సహకారంతో వెనకబడ్డ వర్గాలకు ఉచిత వైద్య శిబిరం, బీదసాదలకు ఉచిత ఆహార పంపిణీ వంటి కార్యక్రమాల గురించి వివరించారు. సంస్థ సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్న వారిని సన్మానించారు. ఇందులో భాగంగా ముఖర్జీ ఫౌండేషన్‌కు చెందిన సోఫీ ముఖర్జీ, సిడ్ ముఖర్జీ, డా. పాల్ లోపెజ్, ఎస్టబాన్ ఆలర్కాన్, జార్జియా మెడికల్ బోర్డు చైర్మన్ డా. శ్రీని గంగసాని, ఆయన సతీమణి మాధవి గంగసాని, జీఏపీఐ సేవా క్లీనిక్ డైరెక్టర్ రవి ఆర్ పోనంగి, జర్నలిస్టు, స్థానిక భారత సంతతి నేత బీకూభాయ్ పటేల్‌లను ఈ ఏడాది అట్లాంటా చాప్టర్ సంత్కరించింది.
NRI: సౌదీ అరేబియాలో 45 ఏళ్ళుగా తెలుగులో సేవలందిస్తున్న చర్చి
ఈ సమ్మేళనంలో ఎమొరీ గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ కోడైరెక్టర్ ప్రొ. మొహమ్మద్ కే అలీ ప్రధానోపన్యాసం చేశారు. మధుమేహం ఓ సంక్షోభస్థాయికి చేరుకుంటున్న వైనాన్ని వివరించారు. వివిధ రంగాల వారు ఒక్కతాటిపైకి వచ్చి ఈ సమస్యకు పరిష్కారాలు కనుగొనాలని పిలుపునిచ్చారు. కాగా, సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సభికులను ఆకట్టుకున్నాయి. నాట్య, సంగీత ప్రదర్శన సభికులకు మర్చిపోలేని జ్ఞాపకంగా నిలిచింది. నాట్సన్ హోటల్ సీఈఓ సామ్ (సుభాష్) పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటును చేసిన విందును కూడా సభికులు ఆస్వాదించారు. సంస్థ చేపడుతున్న వివిధ సేవాకార్యక్రమాలతో స్ఫూర్తి పొందిన అనేక మంది 5.4 డాలర్ల విరాళాలను అట్లాంటా చాప్టర్ కోసం ఇస్తామని ముందుకొచ్చారు. నిస్వార్థ సేవ, సామాజిక స్పృహ గొప్పదనాన్ని చాటుతూ ఈ కార్యక్రమం సాగిందని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు.. పద్మభూషణ గ్రహీత డా. జగదీశ్ శేఠ్ రచించిన తాజా పుస్తకంతో పాటు ఓ ట్రీ కిట్‌ను బహుమతిగా అందజేశారు. జార్జి డబ్ల్యూ. వుడ్రఫ్ స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ చైర్ ప్రొ, దేవేశ్ రంజన్, అట్లాంటా చాప్టర్ జాయింట కోఆర్డినేటర్ షీలా పైల్వాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఈవెంట్ ఆద్యంతం ఆకట్టుకుంది.
NRI: బాలభారతి పాఠశాల విద్యార్థులకు రూ. 10 లక్షల విరాళం!
వసుధైక కుటుంబం అనే హిందూ సిద్ధాంతం స్ఫూర్తితో ముందుకెళుతున్న సేవా ఇంటర్నేషనల్ ఇప్పటివరకూ విపత్తులు తలెత్తిన అనేక సందర్భాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. హరికేన్ కట్రీనా, హరికేన్ హార్వీ, కాలిఫోర్నియా కార్చిచ్చు, కోవిడ్ వంటి విపత్తుల నుంచి బాధితులు కోలుకునేందుకు ఉద్దేశించిన పలు సేవా ప్రాజెక్టులు నిర్వహించింది. అమెరికాతో పాటు బంగ్లాదేశ్, కొలంబియా, గయానా, హైతీ, ఇరాక్, కెన్యా, జపాన్, మొజాంబీక్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల్లో సేవా ఇంటర్నేషనల్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
1991లో భారత్‌లో ఏర్పాటైన సేవా ఇంటర్నేషనల్ ఆ తరువాత విదేశాలకూ విస్తరించింది. తొలిసారిగా యూకే శాఖ 1991లో ప్రారంభమైంది. ఈ సేవా ఉద్యమం స్ఫూర్తితో అమెరికాలో సేవా ఇంటర్నేషనల్ అట్లాంటా చాప్టర్ 2003లో ఏర్పాటైంది. స్వతంత్ర బోర్డు ఉన్న అట్లాంటా చాప్టర్ తనంతట తానుగా అమెరికాలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
NRI: దేశ రాజకీయాల్లో వామపక్షాల పాత్ర కీలకం: సీపీఐ నేత నారాయణ