Share News

Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ దీపావళి వేడుక!

ABN , Publish Date - Oct 29 , 2024 | 12:36 PM

అమెరికా అంతరిక్ష సంస్థ వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పండగ జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్ దీపావళి వేడుక!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అంతరిక్ష సంస్థ వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పండగ జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని షేర్ చేసిన ఆమె.. అంతరిక్షంలో దీపావళి వేడుక జరుపుకోవడం అరుదైన విషయం అని అన్నారు.. అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేత సౌధంలో దీపావళి వేడుకల సందర్భంగా ఈ సందేశాన్ని ప్లే చేశారు (NASA Astronaut Sunita Williams).

NRI: ఫిలడెల్ఫియాలో తానా సాంస్కృతిక పోటీలు


అమెరికా అభివృద్ధిలో భారత సంతతి వారి పాత్రను గుర్తిస్తూ దీపావళి వేడుకల్లో పాలు పంచుకున్న అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలికి సునీతా విలియమ్స్ ధన్యవాదాలు తెలిపారు. అమెరికా అత్యున్నత అధికార వ్యవస్థ భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని గుర్తించినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈమారు తనకు అంతరిక్షంలో ఈ పండుగ జరుపుకునే అరుదైన అవకాశం దక్కిందని సునీతా విలియమ్స్ అన్నారు. భారతీయ సంస్కృతిని తన తరువాతి తరానికి అందించేందుకు తన తండ్రి తాపత్రయపడ్డారని తెలిపారు. దీపావళితో పాటు ఇతర భారతీయ పండుగల గొప్పతనాన్ని చిన్నతనంలో తమకు వివరించారని చెప్పారు. మానవాళి భవిష్యత్తు వెలుగులతో నిండుతుందన్న సందేశాన్ని ఈ పండుగ ఇస్తోందని అన్నారు.

NRI: తానా ప్రపంచసాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘‘శతవసంతాల సాహితీవేత్తలకు శతకోటి వందనాలు”

కాగా, గతేడాది జూన్‌లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన సునీతా విలియమ్స్ నాటి నుంచీ అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఆమె స్పేస్ స్టేషన్‌కు వెళ్లాక వారం రోజుల్లో భూమికి తిరిగి రావాల్సి ఉండగా బోయింగ్ క్రూ క్యాప్సుల్‌లో సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. దీంతో, వ్యోమగాముల భద్రత రీత్యా నాసా వారి తిరుగుప్రాయాణాన్ని వాయిదా వేయడంతో గత 8 నెలలుగా ఆమె అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారిని భూమ్మీదకు తీసుకొచ్చేందుకు నాసా ప్లాన్ చేసింది.ఈసారి స్పేస్ ఎక్స్‌కు చెందిన స్పేస్ క్యాప్సుల్ ద్వారా నాసా వారిని భూమ్మీదకు చేర్చేందుకు ప్రయత్నిస్తోంది.

NRI: రతన్ టాటాకు తానా న్యూ ఇంగ్లాండ్ విభాగం ఘన నివాళులు!


ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అక్కడి భారతీయ సంతతి వారితో కలిసి శ్వేత సౌధంలో దిపావళి వేడుకల్లో పాల్గొన్నారు. దివ్వెను వెలిగించి వేడుకను ప్రారంభించారు. ఈ వేడుకలకు సుమారు 600 మంది ప్రముఖ భారత సంతతి వ్యక్తులు హాజరయ్యారు. ప్రతినిధుల సభ సభ్యుడు రో ఖన్నాకు కొడుకు కూతుళ్లతో కలిసి బైడెన్ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్వేత సౌధంలో దీపావళి జరుపుకునే సంప్రదాయాన్ని అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ 2003లో ప్రారంభించారు. నాటి నుంచీ ప్రతి ఏటా ఈ వేడుకలు శ్వేత సౌధంలో జరుగుతున్నాయి.

Read Latest and NRI News

Updated Date - Oct 29 , 2024 | 01:04 PM