Share News

TANA కొత్త టీమ్‌కు అంజయ్య చౌదరి లావు అభినందనలు!

ABN , Publish Date - Jan 21 , 2024 | 07:55 PM

ప్రతిష్ఠాత్మక తానా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన "నరేన్ కొడాలి" టీంకు తానా తాజా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు శుభాకాంక్షలు తెలిపారు.

TANA కొత్త టీమ్‌కు అంజయ్య చౌదరి లావు అభినందనలు!

ఎన్నారై డెస్క్: ప్రతిష్టాత్మక తానా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన "నరేన్ కొడాలి" టీమ్‌కు తానా తాజా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు శుభాకాంక్షలు తెలిపారు. నరేన్ కొడాలి టీమ్‌కు మద్దతు తెలుపవలసిందిగా చేసిన అభ్యర్థనను మన్నించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. సుహృద్భావ వాతావరణంలో సామరస్యపూర్వకంగా జరిగిన ఈ ఎన్నికల్లో గెలిచిన వారు, పోటీ చేసిన వారితో సహా అందరూ ఇక ముందు కూడా ఎప్పటిలాగే కలిసిమెలసి తానాని అత్యున్నత శిఖరాన నిలిపే విధంగా వ్యవహరిస్తూ "మన కోసం తానా.. తానా కోసం మనం" అని నినదిస్తూ విశ్వంలోని తెలుగు వారందరికీ సహాయపడే విధంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.

Updated Date - Jan 21 , 2024 | 09:54 PM