Share News

NRI: తానా ఫౌండేషన్‌ సహాయం.. 60 బాలికలకు సైకిళ్ళ పంపిణీ

ABN , Publish Date - Sep 27 , 2024 | 10:10 PM

ఖమ్మం శాంతి నగర్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదరణ పథకం కింద బాలికలకు సైకిళ్ళ పంపిణీ జరిగింది.

NRI: తానా ఫౌండేషన్‌ సహాయం.. 60 బాలికలకు సైకిళ్ళ పంపిణీ

  • స్కూళ్ళ బెంచీల మరమ్మతులకు 2 లక్షల విరాళం

ఎన్నారై డెస్క్: ఖమ్మం శాంతి నగర్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదరణ పథకం కింద బాలికలకు సైకిళ్ళ పంపిణీ జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ డాన్ బస్కో ఈ కార్యక్రమానికి సునీత కాట్రగడ్డ స్మారకార్థం రాలేకి చెందిన ప్రశాంత్‌ కాట్రగడ్డ డోనర్‌‌గా వ్యవహరించారు (NRI) . తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్‌ భక్త బల్లా నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శశికాంత్‌ వల్లేపల్లి మాట్లాడుతూ, ఫౌండేషన్‌ తరపున వివిధ కార్యక్రమాలను చేస్తున్నామని, ఆదరణ పథకం కింద ప్రస్తుతం 60మంది బాలికలకు సైకిళ్ళను అందజేస్తున్నామని చెప్పారు.

NRI: ప్రతిభకు జేజేలు! తానా బ్యాడ్మింటన్‌ పోటీలు విజయవంతం

1.jpg


స్థానిక జలగం నగర్ ఉన్నత పాఠశాల పరిధిలో 200 మంది వరదబాధిత విద్యార్థుల కుటుంబాలకు కూడా తానా ఫౌండేషన్‌ ఇటీవల సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వరదల కారణంగా కొన్ని స్కూళ్ళల్లో బెంచీలు, కుర్చీలు వంటి సామగ్రికి తీవ్ర నష్టం జరిగింది. వీటికి తగిన చర్యలు చేపట్టవలసిందిగా యువ నాయకులు తుమ్మల యుగంధర్ సూచన చేయగా వీటి మరమ్మతుల కోసం ఫౌండేషన్‌ తరపున 2 లక్షల రూపాయలను ఆయా స్కూళ్ళకు విరాళంగా అందజేస్తున్నట్లు శశికాంత్‌ వల్లేపల్లి తెలిపారు. వెంటనే రూ.2లక్షల చెక్‌ను ఖమ్మం అర్బన్ విద్యాధికారి రాములుకు అందజేశారు.

2.jpgNRI: తానా కళాశాల పరీక్షలు విజయవంతం

ఈ కార్యక్రమంలో యువనాయకుల తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఖమ్మంలో ఉన్న అన్ని ప్రభుత్వ విద్యాలయాలను మరింత అభివృద్దిలోకి తీసుకెళతామని తెలియజేశారు. తానా ఫౌండేషన్‌ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమైనవని అన్నారు. ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి, తానా ప్రెసిడెంట్‌ నిరంజన్‌ శృంగవరపు, ఈసీ టీమ్‌‌ను అభినందించారు.

NRI: తెలంగాణ సీఎంకు గల్ఫ్ టీపీసీసీ, దుబాయి అంబేద్కర్ సంఘం కృతజ్ఞతలు


ఈ కార్యక్రమానికి సహకరించిన సహస్ర మినిస్ట్రీస్‌ అధ్యక్షులు లాల్ బహుదూర్ శాస్త్రికి, తానా ప్రెసిడెంట్‌ నిరంజన్‌ శృంగవరపునకు, భక్తభల్లాకు, శశికాంత్‌ వల్లేపల్లికి బాలికలు, వారి తల్లితండ్రులు ధన్యవాదాలు తెలిపారు. స్కూల్‌ బెంచ్‌కు విరాళం అందించినందుకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తానా ఫౌండేషన్‌‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో డా. కూరపాటి ప్రదీప్, ఎమ్ఈఓ రాములు, ఎన్నారై ఫౌండేషన్ అధ్యక్షులు బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వర్ రావు, పసుమర్తి రంగారావు, శ్రీ గడ్డం వేంకటేశ్వర రావు, ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ అధ్యక్షలు వాసిరెడ్డి శ్రీనివాస్ ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

4.jpg5.jpg

Read Latest and NRI News

Updated Date - Sep 27 , 2024 | 10:11 PM