Share News

Tana Foundation: తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ల పంపిణీ..

ABN , Publish Date - Aug 03 , 2024 | 10:02 PM

Tana Foundation: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేయూత కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో ఆగస్టు 3వ తేదీ శనివారం నాడు 50 మంది విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లను పంపిణీ చేశారు.

Tana Foundation: తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ల పంపిణీ..
Tana Foundation

Tana Foundation: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేయూత కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో ఆగస్టు 3వ తేదీ శనివారం నాడు 50 మంది విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లను పంపిణీ చేశారు. దాదాపు రూ. 7 లక్షల విలువైన ఈ స్కాలర్‌‌షిప్‌ లను గౌతమ్‌ అమర్నేని, వారి కుటుంబం స్పాన్సర్‌ చేసింది. ఈ సందర్భంగా గౌతమ్‌ అమర్నేని మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌‌లను పంపిణీ చేసే అవకాశం ఇచ్చినందుకు తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు, ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి, కో-ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌ పోలవరపులకు ధన్యవాదాలు తెలిపారు.


Tana-2.jpg

ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి మాట్లాడుతూ.. తానా ఫౌండేషన్‌ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చేయూత ద్వారా అనేకమంది విద్యార్థులకు స్కాలర్‌‌షిప్‌ లను ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకోలేక పోతున్నవారికి తమవంతుగా సహాయం అందిస్తున్నామన్నారు. అలాగే వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యసేవలను కూడా అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తానా నాయకులకు, ఫౌండేషన్‌ ట్రస్టీలకు, దాతలకు, పడాల ట్రస్ట్‌ డైరెక్టర్‌ రవీంద్ర తంగిరాలకు ధన్యవాదాలు చెబుతున్నట్లు శశికాంత్‌ వల్లేపల్లి తన ప్రసంగంలో పేర్కొన్నారు.


Also Read:

పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!

స్కూలు పిల్లలపై గోడ కూలి నలుగురు దుర్మరణం

అత్యంత ప్రజాదరణ కలిగిన నేత మోదీనే

For More NRI News and Telugu News..

Updated Date - Aug 03 , 2024 | 10:02 PM