Share News

NRI: పెనమలూరులో తానా ఉచిత కంటి వైద్యశిబిరం విజయవంతం

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:56 PM

తానా ఆధ్వర్యంలో ‘రైతు కోసం తానా’ పేరుతో పెనమలూరులోని జడ్‌‌పీ హైస్కూలులో ఉచిత మెగా కంటి వైద్యశిబిరాన్ని జరిగింది.

NRI: పెనమలూరులో తానా ఉచిత కంటి వైద్యశిబిరం విజయవంతం

ఎన్నారై డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘంలో (తానా) ఇంటర్నేషనల్‌ కోఆర్డినేటర్‌గా ఉన్న ఠాగూర్‌ మల్లినేని అటు అమెరికాలోనూ, ఇటు జన్మభూమిలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. పెనమలూరు వచ్చిన సందర్భంగా ప్రజలకు ఏదైనా మేలు చేయాలని భావించి ఉయ్యూరులోని కేసీపీ రోటరీ హాస్పిటల్‌ వారి సహకారంతో, తానా ఆధ్వర్యంలో రైతు కోసం తానా పేరుతో ఉచిత మెగా కంటి వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు (NRI). అక్టోబర్‌ 20వ తేదీన పెనమలూరులోని జడ్‌‌పీ హైస్కూలులో జరిగిన ఈ కంటి వైద్య శిబిరానికి దాదాపు 400 మందికిపైగా హాజరై పరీక్షలను చేసుకున్నారు.

Mahatma Gandhi Memorial: అంగరంగ వైభవంగా మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవ వేడుకలు8.jpg


ఈ పరీక్షల్లో కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి 7వ తేదీన ఆపరేషన్లు చేయనున్నారు. 10వ తేదీన అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేయనున్నారు. అలాగే పేద రైతులకు పవర్‌ స్ప్రేయర్లను, రక్షణ పరికరాలను, మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఠాగూర్‌ మల్లినేని మాట్లాడుతూ, తానా తరపున జన్మభూమిలో సేవా కార్యక్రమాలు చేసే అవకాశం లభించిందని, ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

4.jpg

NRI: తానా ఆధ్వర్యంలో అమెరికాలో రహదారుల దత్తత


తానా సెక్రటరీ రాజా కసుకుర్తి, ఫౌండేషన్‌ చైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి సహకారంతో, తానా ‘రైతు కోసం’ చైర్‌ రమణ అన్నె, కో చైర్‌ ప్రసాద్‌ కొల్లి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనమలూరు ఎన్నారై ప్రతినిధులు పాలడుగు సుధీర్‌, కిలారు ప్రవీణ్‌, మోర్ల నరేంద్ర ‌తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు.

3.jpg7.jpg5.jpg6.jpgRead Latest and NRI News

Updated Date - Oct 20 , 2024 | 03:56 PM