Share News

NRI: రతన్ టాటాకు తానా న్యూ ఇంగ్లాండ్ విభాగం ఘన నివాళులు!

ABN , Publish Date - Oct 24 , 2024 | 05:55 PM

తన దాతృత్వం, వ్యాపారదక్షతతో భారత్‌పై చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా మృతి తానా న్యూఇంగ్లండ్ విభాగం విచారం వ్యక్తం చేసింది. అక్టోబర్ 20 నాడు తానా సభ్యులు సంతాప సభ నిర్వహించారు.

NRI: రతన్ టాటాకు తానా న్యూ ఇంగ్లాండ్ విభాగం ఘన నివాళులు!

ఎన్నారై డెస్క్: తన దాతృత్వం, వ్యాపారదక్షతతో భారత్‌పై చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి రతన్ నావల్ టాటా మృతి తానా న్యూఇంగ్లండ్ విభాగం విచారం వ్యక్తం చేసింది. అక్టోబర్ 20న తానా సభ్యులు సంతాప సభ నిర్వహించారు (NRI).

తానా నాయకులు, అమెరికా స్కూల్ కమిటీ సభ్యులు సోంపల్లి కృష్ణ ప్రసాద్, యెండూరి శ్రీనివాస్, రావు యలమంచిలి మాట్లాడుతూ.. ఈ సంతాప సభ అన్ని వర్గాల ప్రజలు రతన్ టాటాకు తమ కృతజ్ఞతలు తెలియజేయడానికి, ఆయన దయాగుణం, వివేకం, నాయకత్వాన్ని స్మరించుకోవడానికి ఒక అవకాశంగా మారిందని అన్నారు. రతన్ టాటా ఎన్నో జీవితాలను ప్రభావితం చేశారని, వారి ద్వారా ఆయన వారసత్వం కొనసాగుతుందని అన్నారు. న్యూ ఇంగ్లాండ్ అంతటా అనేక సంతాప సభలను నిర్వాహిస్తామని ఉద్ఘాటించారు.

1.jpg

NRI: వాషింగ్టన్ డీసీలో ఘనంగా అట్లతద్దె వేడుకలు


తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి తన సందేశంలో రతన్ టాటాపై ప్రశంసల వర్షం కురిపించారు. పరోపకారం కోసం వ్యాపార దృక్పథాన్ని కలిగిన రతన్ టాటా, తన ఆదాయంలో 66% నిరుపేదలకు విరాళంగా ఇచ్చేవారని, దాతృత్వానికే దాతృత్వం నేర్పిన మహోన్నత వ్యక్తి రతన్ నావల్ టాటా అని శ్లాఘించారు.

ఉప్పు నుండి ఉక్కు వరకు ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిన మహనీయుడు రతన్ టాటా అని సభకు హాజరైన ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో నివాళులు సమర్పించారు. భారత ప్రభుత్వం రతన్ టాటాను భారతరత్నతో సత్కరించాలని సంపత్ కట్టా అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విజయ్ బెజవాడ, రాజేందర్ కల్వల, వేణు దొడ్డా, శ్రీనివాస్ రెడ్డి ఏరువ, శేషుబాబు కొణతం, నవీన్ రుద్ర, వేణు గండికోట, ప్రవీణ్ జయరావు, హనుమంత్ పంచినేని, ప్రసాద్ అనేమ్, శ్యామ్ సింగరాజు, రామరాజు, సుధాకర్, రుద్ర, శ్రీనాధ్, మురళి ముద్దాడ, సుజన్ నందమూరి, కిరణ్ అడునూతల, రాజా ఉపాధ్యాయుల, సతీష్ చీపురుపల్లి తదితరులు పాల్గొన్నారు.

3.jpgNRI: 24వ తానా మహాసభలు! ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌ సక్సెస్‌!


ఈ సభకు ముగింపు సందర్భంగా గోపి నెక్కలపూడి మాట్లాడుతూ రతన్ టాటా జీవితం గొప్పదని, ఆయన పాటించిన విలువలు, వదిలివెళ్లిన గొప్ప వారసత్వాన్ని అందరూ కొనసాగించాలని అన్నారు. ఆయన వ్యాపార సరళి, దయాగుణం, దూరదృష్టి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.

4.jpgRead Latest and NRI News

Updated Date - Oct 24 , 2024 | 06:14 PM