Share News

NRI: తెలుగుదేశం కార్యకర్తలు నిజాయితీకి మారుపేరు: ఖతర్ టీడీపీ అధ్యక్షుడు

ABN , Publish Date - Jul 28 , 2024 | 05:31 PM

గల్ఫ్‌లో ఇబ్బందులు పడ్డ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసి సారెళ్ళ వీరేంద్రకుమార్‌ను స్వదేశానికి తిరిగి వెళ్లడం గురించి ఖతర్‌లో జరుగుతున్న ప్రచారంపై టీడీపీ ఖతర్ శాఖ స్పందించింది. పార్టీ అభిమానులు, కార్యవర్గం అంతా కూడా ఖతర్‌లో క్షేత్రస్థాయిలో కూడా పని చేస్తున్నారని, ప్రచారానికి తాము ఆమడ దూరంలో ఉంటామని చెప్పారు.

NRI: తెలుగుదేశం కార్యకర్తలు నిజాయితీకి మారుపేరు: ఖతర్ టీడీపీ అధ్యక్షుడు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఖతర్‌కు వచ్చి అక్కడి నుండి సౌదీ అరేబియా ఎడారిలో ఒంటెల కాపరిగా ఇరుక్కున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసి సారెళ్ళ వీరేంద్రకుమార్‌ను (NRI) స్వదేశానికి తిరిగి వెళ్లడం గురించి ఖతర్‌లో జరుగుతున్న ప్రచారంపై టీడీపీ ఖతర్ శాఖ స్పందించింది. పార్టీ ఖతర్ శాఖ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రమణ ఒక ప్రకటన చేస్తూ సంఘటనకు సంబంధించి పూర్వాపరాలను వివరించారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యవర్గం అంతా కూడా ఖతర్‌లో క్షేత్రస్థాయిలో కూడా పని చేస్తున్నారని, ప్రచారానికి తాము ఆమడ దూరంలో ఉంటూ పార్టీ బలోపేతానికి నిరంతరం పని చేస్తున్నట్లుగా వివరించారు.

NRI: ఎడారిలో మోసపోయిన మరో ప్రవాసీని రక్షించిన నారా లోకేశ్!


వీరేంద్రకుమార్‌ను స్వదేశానికి తిరిగి పంపించవల్సిందిగా తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా తనకు ఫోన్ చేసి అడిగారని, దానికి తాను స్పందించి ఖతరీ యజమానితో మాట్లాడగా సదరు మనిషిని ఖతర్‌కు తీసుకురావడానికి తనకు 5 వేల రియాళ్ళు ఖర్చు అయినట్లుగా చెబుతూ అంత మెత్తాన్ని చెల్లిస్తే తాను తిరిగి పంపిస్తానని షరతు విధించాడని పేర్కొన్నారు. ఖతరీ యజమాని అడిగిన దానికి తోడుగా అతను ఆంధ్రాలో దళారీకి ఇచ్చిన మొత్తం, అతని కుటుంబ ఖర్చు కోసం కూడా కొంత నగదును చేయూతగా అందించే ఉద్దేశ్యంతో సహాయం కోసం ఆర్థించామని రమణ వివరించారు. ఈ లోపు వీరేంద్రకుమార్ సౌదీ అరేబియా సరిహద్దు లోపల మాత్రమే ఉన్నట్లుగా తెలిసిందని, తామే అతన్ని సౌదీ నుండి భారతదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని రాధాకృష్ణ ఆ తరువాత సూచించడంతో తాము తమ ప్రయత్నాలను విరమించుకొన్నట్లుగా రమణ అన్నారు.


మొత్తం గల్ఫ్ ప్రాంతంలో ఖతర్‌లోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిబద్ధత, నిజాయితీ తెలుగుదేశం అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తున్నట్లుగా రమణ నొక్కి చెప్పారు. సామాజిక మాధ్యమాలలో ప్రచారం, విరాళాల సేకరణ గురించి తమపై వచ్చిన అరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jul 28 , 2024 | 05:31 PM