NRI: కాన్సుల్ జనరల్‌తో సమావేశమైన తెలుగు చర్చి ప్రతినిధి బృందం
ABN , Publish Date - Oct 17 , 2024 | 07:32 PM
సౌదీ అరేబియాలోని జెద్ధా నగరంలో సేవలందిస్తున్న గ్లోరియస్ తెలుగు చర్చి (జి.టి.సి) ప్రతినిధి బృందం గురువారం భారతీయ కాన్సుల్ జనరల్ ఫహాద్ అహ్మద్ ఖాన్ సూరీతో సమావేశమైంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలోని జెద్ధా నగరంలో సేవలందిస్తున్న గ్లోరియస్ తెలుగు చర్చి (జి.టి.సి) ప్రతినిధి బృందం గురువారం భారతీయ కాన్సుల్ జనరల్ ఫహాద్ అహ్మద్ ఖాన్ సూరీతో సమావేశమైంది (NRI).
పాస్టర్ హానుక్ అభినవ్ నేతృత్వంలో కలిసిన ప్రతినిధి బృందం సౌదీ అరేబియాలో తెలుగు క్రైస్తవ సమాజం గురించి వివరించింది. ప్రవాసంలో ప్రతి ఒక్క భారతీయుడు కులమతాలతో సంబంధం లేకుండా భారతీయుడు మొదలు అని అ తర్వాతే మిగిలిన అన్ని విషయాలని పాస్టర్ హానుక్ చెప్పారు.
తెలుగు క్రైస్తవులను కాన్సుల్ జనరల్ అభినందించినట్లుగా కూడా పాస్టర్ హానుక్ చెప్పారు. క్రైస్తవ బృందం కాన్సుల్ జనరల్‌కు శాలువ కప్పి సన్మానించింది.
NRI: రాధిక మంగిపూడి రాసిన 'విజయనగర వైభవ శతకం' ఆవిష్కరణ