NRI: ఖతర్ జాతీయ క్రీడా దినోత్సవం.. తెలుగు కళా సమితి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రీడా కార్యక్రమాలు!
ABN , Publish Date - Feb 20 , 2024 | 07:56 PM
ఖతర్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలుగు కళా సమితి సంస్థ ప్రెసిడెంట్ డి. హరీశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రీడాకార్యక్రమం నిర్వహించారు.
ఎన్నారై డెస్క్: ఖతర్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలుగు కళా సమితి సంస్థ ప్రెసిడెంట్ డి. హరీశ్ ఆధ్వర్యంలో లయోలా ఇంటర్నేషనల్ స్కూల్ అల్-నాసర్ బ్రాంచ్‌లో ఖతర్ తెలుగు వాసుల కోసం వివిధ వినోదభరితమైన, ఉత్తేజకరమైన క్రీడా కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమం మొదటిగా వార్మప్ జుంబాతో ప్రారంభమై ఉల్లాసమైన క్రీడా కార్యక్రమాలలోకి అడుగుపెట్టింది. వాటిలో భాగంగా లెమన్ అండ్ స్పూన్, త్రో బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, టగ్ ఆఫ్ వార్, బాటిల్ బ్యాలెన్సింగ్, హాష్ అప్, హూలా హూప్, స్కిప్పింగ్, కబడ్డీ, ఫ్యూషన్ కోకో, కర్చీఫ్ రింగ్ ఆట, ఎన్నో క్రీడలు జరిగాయి.
NRI: అరబ్బునాట అనాథలకు అంత్యేష్టి!
ఈ సందర్భంగా ఖతర్‌లో ప్రముఖమైన వేర్వేరు సంస్థల నాయకులు విచ్చేసి కార్యక్రమానికి ప్రేరణను అందించారు. వారిలో ముఖ్యంగా ICC ఉపాధ్యక్షులు సుబ్రమణ్య హెబ్బాగేలు, ICC MC సత్యనారాయణ మలిరెడ్డి, TKS వ్యవస్థాపక సభ్యులు, ఔట్ రీచ్ అడ్వైజర్ K S ప్రసాద్, TKS వ్యవస్థాపక సభ్యులు, ఔట్ రీచ్ ట్రెజరర్ కృష్ణకుమార్, ICBF MC సభ్యులు శంకర్ గౌడ్, TGS అధ్యక్షులు మధు, TGS ఉపాధ్యక్షులు రాజు ఇంకా ఇతర సంఘం నాయకులు హాజరయ్యారు. అనంతరం పోటీల్లోని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
చివరిగా, తెలుగు కళా సమితి సభ్యులతో స్వయంగా తయారైన ఆరోగ్యకరమైన వంటకాలను విచ్చేసిన వారందరికి అందజేశారు.
ఖతర్ జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొన్న వారందరికీ, ముఖ్యంగా అద్భుతమైన వేదికను అందించినందుకు లయోలా ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అనూప్ చక్రవర్తికి, శరత్ కోడూరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అల్వాజ్బా డైరీ, జ్యూస్‌ల కర్మాగార యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ అద్భుతంగా కార్యక్రమం ముగింపు పలికింది.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి