Share News

NRI: కష్టాల కడలి నుండి మాతృదేశానికి తెలుగు మహిళ

ABN , Publish Date - Sep 29 , 2024 | 05:06 PM

పొట్టకూటి కోసం ఎడారి దేశానికి వచ్చి గత కొంతకాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఒక తెలుగు మహిళ ఎట్టకేలకు ఆదివారం స్వదేశానికి తిరిగి చేరుకుంది.

NRI: కష్టాల కడలి నుండి మాతృదేశానికి  తెలుగు మహిళ

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పొట్టకూటి కోసం ఎడారి దేశానికి వచ్చి గత కొంతకాలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఒక తెలుగు మహిళ (NRI) ఎట్టకేలకు ఆదివారం స్వదేశానికి తిరిగి చేరుకుంది.

కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లి గ్రామానికి చెందిన గంధం రత్నం అనే మహిళ గత కొన్నాళ్ళుగా కువైత్‌లో ఒక అరబ్బు యాజమాని ఇంట్లో పని చేస్తోంది ఆ తర్వాత అమెను యాజమాని తనతో పాటు సౌదీ అరేబియాకు తీసుకొచ్చాడు. అమె కథనం ప్రకారం, యాజమాని ఇంట్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న అమె గత్యంతరం లేని పరిస్థితులలో యాజమాని ఇంటి నుండి పారిపోయింది. ఈ రకంగా పారిపోవడం స్థానిక చట్టాల ప్రకారం నేరం.

NRI: తానా ఫౌండేషన్‌ సహాయం.. 60 బాలికలకు సైకిళ్ళ పంపిణీ


తనను ఎలాగైన స్వదేశానికి పంపించాలంటూ దమ్మాంలోని అంతర్జాతీయ విమానశ్రాయానికి చేరుకోగా టిక్కెట్టు గానీ చేతిలో చిల్లి గవ్వ గానీ లేకుండా అమె విమానశ్రాయంలో నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్న విషయాన్ని స్థానిక అధికారుల ద్వారా తెలుసుకొన్న ప్రముఖ సామాజిక సేవకుడు నాజ్ ఆమెను తీసుకొని తెలుగు ప్రవాసీ సంఘం ‘సాటా’ ప్రతినిధులు లీలా అరవింద్, తేజకు తెలియజేశారు. సాటి మహిళ అయిన గుంటూరు జిల్లాకు చెందిన లీల అమె పరిస్థితికి చలించి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి ఆదుకొన్నారు. రత్నం వీసా రద్దయి దేశం విడిచి వెళ్ళడానికి ఇమ్మిగ్రేషన్ అనుమతి లభించే వరకు ఆమెను తన బంధువుగా భావించి అపన్న హస్తమందించారు.

తన భర్త తాగుడు వలన అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమయ్యాడని ఆమె చెప్పింది. తనకు ఇద్దరు ఆడ పిల్లలున్నారని వారి బంగారు భవిష్యత్తు కోసం తాను గల్ఫ్ ఉపాధికి వచ్చినట్లుగా రత్నం తెలిపింది. తాను అంతకు ముందు బహ్రెయిన్, కువైత్‌లలో కూడ పని చేసినట్లుగా వెల్లడించింది.

NRI: బే ఏరియాలో ‘దేవర' ఫీవర్.. ఫ్యాన్స్ హంగామా!!


ఇద్దరు కూతుళ్ళ తల్లి అయిన రత్నంకు బహుమతులు, నూతన దుస్తులు వగైరా కొనిపించిన లీల, అరవింద్ దంపతులతో పాటు అవినాష్ ఆమెను విమానశ్రాయం వరకూ దించి విడ్కోలు పలికారు. హైదరాబాద్ విమానశ్రాయం నుండి కోనసీమలోని స్వగ్రామానికి చేరుకొనే వరకు తాను ఆందోళనతోనే ఉన్నట్లు లీల పేర్కొన్నారు.

రత్నం హైదరాబాద్ వరకు వెళ్ళడానికి అవసరమైన విమాన టిక్కెట్‌ను తెలుగు ప్రవాసీయులు సమకూర్చారని సాటా ఈశాన్య ప్రాంత అధ్యక్షుడు తేజ పల్లెం తెలిపారు. వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Latest and NRI News

Updated Date - Sep 29 , 2024 | 05:20 PM