NRI: త్వరపడండి.. విదేశీ విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీల కీలక సూచన!
ABN , Publish Date - Nov 29 , 2024 | 09:10 PM
యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులు, సిబ్బందికి కీలక సూచన చేశాయి. ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందే అమెరికాకు తిరిగొచ్చేయాలని పలు యూనివర్సిటీలు సూచించాయి.
ఎన్నారై డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణం చేయనున్నారు. అధ్యక్షుడైన వెంటనే ఆయన వలసలపై ఉక్కుపాదం మోపుతారన్న భయాందోళనలు అగ్రరాజ్యంలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులు, సిబ్బందికి కీలక సూచన చేశాయి. ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందే అమెరికాకు తిరిగొచ్చేయాలని పలు యూనివర్సిటీలు సూచించాయి (NRI).
NRI: తెలుగు భాష గొప్పతనాన్ని గుర్తుచేసుకున్న టాంటెక్స్ సాహిత్య సదస్సు
యూనివర్సిటీ ఆఫ్ ఆమ్రెస్ట్‌తో పాటు మరో రెండు యూనివర్సిటీలు విదేశీ విద్యార్థులను త్వరపడాలంటూ సూచించాయి. ‘‘జాగ్రత్తగా ఉండాలంటూ ఈ సూచన చేస్తున్నాం. కొత్త ప్రభుత్వం కొలువు దీరిని తొలి రోజునే పలు విధానాలు అమలు చేసే అవకాశం ఉంది’’ అని యూనివర్శిటీకి చెందిన ఆఫీస్ ఆఫ్ గ్లోబల్ ఎఫెయిర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. విదేశీ విద్యార్థులందరూ ప్రస్తుతం టెన్షన్‌లో ఉన్నారని యూనివర్శిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన ప్రొఫెసర్ ఖోల్ ఈస్ట్ పేర్కొన్నారు. కాగా, వెస్లెయాన్ యూనివర్శిటీతో పాటు ప్రముఖ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఇదే తరహా సూచనలు చేశాయి. విదేశీ విద్యార్థులు కొంత కాలం ఇక్కడ ఉండటమే మంచిదని కూడా వెస్లెయాన్ యూనివర్శిటీ సూచించింది. కొత్త ప్రభుత్వ విధానాల కారణంగా వీసాల జారీ, విదేశాల్లోని ఎంబసీల కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఎమ్ఐటీ పేర్కొంది.
NRI news: జపాన్‌లో కార్తీక వన సమారాధన
ఈ సందర్భంగా అనేక మంది 2017లో ట్రంప్ విధించిన నిషేధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో గద్దెనెక్కిన వారం రోజులకే ట్రంప్.. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఏడు దేశాల వారు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించారు. ఫలితంగా ఎయిర్‌పోర్టుల్లో పెను కలకలానికే దారి తీసింది. అనేక మంది విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది. యూమాస్ డార్ట్‌మౌత్‌కు చెందిన ఇద్దరు అధ్యాపకులు.. పర్మెనెంట్ రెసిడెన్స్ అనుమతి ఉన్నప్పటికీ గంటల పాటు బోస్టన్ లోగన్ ఎయిర్‌పోర్టులో ఉండిపోవాల్సి వచ్చింది. చివరకు యూనివర్సిటీ అధికారులు స్వయంగా కల్పించుకోవడంతో ఎయిర్‌పొర్టు అధికారులు వారిని అమెరికాలో కాలుపెట్టేందుకు అనుమతించారు.
NRI: హైదరాబాద్ పోలీసుల సేవలకు ఖతర్‌లో సన్మానం