డాలస్‌లో వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు
ABN, Publish Date - Sep 30 , 2024 | 01:13 PM
డాలస్, టెక్సాస్: అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా ఆధ్వర్యంలో దాదాసాహెబ్ పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు సెప్టెంబర్ 20న జన్మదినం సందర్బంగా డాలస్ నగరం (యాలెన్, రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియం)లో అక్కినేని అభిమానులందరి మధ్య ఏఎన్నార్ శతజయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, పూర్వాధ్యక్షుడు రవి కొండబోలు, రావు కల్వాల, శారద ఆకునూరి, చలపతిరావు కొండ్రకుంట, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ధామ భక్తవత్సలు వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎ.ఎఫ్.ఎ ప్రస్తుత అధ్యక్షుడు మురళి వెన్నం అందరికీ స్వాగతం పలికి డా. అక్కినేనితో ఉన్న సన్నిహిత అనుబంధాన్ని, గత పది సంవత్సరాలగా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను సోదాహరణంగా వివరించారు.
![డాలస్‌లో వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు](https://media.andhrajyothy.com/media/2024/20240929/anr1_244dfd6049_v_jpg.webp)
అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా ఆధ్వర్యంలో నటసామ్రాట్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు డాలస్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి.
![డాలస్‌లో వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు](https://media.andhrajyothy.com/media/2024/20240929/anr2_c77196b762_v_jpg.webp)
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల సందర్బంగా డాలస్‌లోని యాలెన్, రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియంలో కేక్ కట్ చేస్తున్న దృశ్యం...
![డాలస్‌లో వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు](https://media.andhrajyothy.com/media/2024/20240929/anr3_7a0cea753e_v_jpg.webp)
అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన అక్కినేని శతజయంతి వేడుకల్లో ప్రత్యేక అతిథులను శాలువ కప్పి సన్మానించారు.
![డాలస్‌లో వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు](https://media.andhrajyothy.com/media/2024/20240929/anr4_da922cbea2_v_jpg.webp)
డాక్టర్ అక్కినేని శతజయంతి వేడుకల్లో ముఖ్య అతిథులకు అక్కినేని జ్ఞాపికను బహూకరిస్తున్న దృశ్యం..
![డాలస్‌లో వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు](https://media.andhrajyothy.com/media/2024/20240929/anr5_cf38cc1e81_v_jpg.webp)
అక్కినేని శతజయంతి సందర్భంగా “అక్కినేని ఆణిముత్యాలు” (అక్కినేని శతజయంతి – శతచిత్ర విశేషాలు) ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.
![డాలస్‌లో వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు](https://media.andhrajyothy.com/media/2024/20240929/anr6_c21b8e859c_v_jpg.webp)
అక్కినేని చిత్ర గీతాంజలి పేరిట కొన్ని సినిమాల్లోని మధురమైన పాటలకు డ్యాన్స్ చేస్తున్న దృశ్యం..
![డాలస్‌లో వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు](https://media.andhrajyothy.com/media/2024/20240929/anr7_16cca17c63_v_jpg.webp)
అక్కినేని చిత్రాలలోని కొన్ని పాటలకు స్త్రీ వేషధారణలో పురుషుడు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది.
![డాలస్‌లో వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు](https://media.andhrajyothy.com/media/2024/20240929/anr8_ec3baf5caa_v_jpg.webp)
అక్కినేని చిత్ర గీతాంజలి పేరిట కొన్ని సినిమాల్లోని మధురమైన గీతాలను పాడి అందరినీ అలరించారు..
![డాలస్‌లో వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు](https://media.andhrajyothy.com/media/2024/20240929/anr9_29baafe939_v_jpg.webp)
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలకు భారీ సంఖ్యలో హాజరైన ఎన్నారైలు..
![డాలస్‌లో వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు](https://media.andhrajyothy.com/media/2024/20240929/anr10_00e3436d49_v_jpg.webp)
షడ్రుచులతో విందు భోజనం..
Updated at - Sep 30 , 2024 | 01:13 PM