ఎంగిలి పూల బతుకమ్మ పాట మీకోసం

ABN, Publish Date - Oct 02 , 2024 | 12:52 PM

తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఇష్టంగా చేసుకునే బతుకమ్మ పండుగ రానేవచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగ ఈరోజు (బుధవారం) నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణ ప్రజలకు ఈ పండుగ చాలా ప్రత్యేకమైంది. తెలంగాణ సంస్కృతిక ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ నేటి (అక్టోబర్ 2) నుంచి తొమ్మిరోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు జరుపుకోనున్నారు

ఎంగిలి పూల బతుకమ్మ పాట మీకోసం 1/12

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. ఆనాటి కాలాన ఉయ్యాలో.. ధర్మాంగుడను రాజు ఉయ్యాలో..

ఎంగిలి పూల బతుకమ్మ పాట మీకోసం 2/12

అతి సత్యవతి యనేరు ఉయ్యాలో.. నూరు నోములు నోమి ఉయ్యాలో.. నూరు మందిని కాంచె ఉయ్యాలో.. వారు శూరులై ఉయ్యాలో..

ఎంగిలి పూల బతుకమ్మ పాట మీకోసం 3/12

వైరులచే హతమైరి ఉయ్యాలో.. తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో.. తరగని శోకమున ఉయ్యాలో.. ధన రాజ్యములను బాసి ఉయ్యాలో..

ఎంగిలి పూల బతుకమ్మ పాట మీకోసం 4/12

దాయాదులను బాసి ఉయ్యాలో.. వనితతో ఆ రాజు ఉయ్యాలో.. వనమందు నివసించే ఉయ్యాలో.. కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో..

ఎంగిలి పూల బతుకమ్మ పాట మీకోసం 5/12

ఘన తపంబొనరించే ఉయ్యాలో.. ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో.. పలికే వరమడుగమని ఉయ్యాలో.. వినిపించి వేడుచూ ఉయ్యాలో..

ఎంగిలి పూల బతుకమ్మ పాట మీకోసం 6/12

వెలది తన గర్భమున ఉయ్యాలో.. పుట్టమని వేడగా ఉయ్యాలో.. పూబోణి మది మెచ్చి ఉయ్యాలో.. సత్యవతి గర్భమున ఉయ్యాలో..

ఎంగిలి పూల బతుకమ్మ పాట మీకోసం 7/12

జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో.. అంతలో మునులును ఉయ్యాలో.. అక్కడకు వచ్చిరి ఉయ్యాలో.. కపిల గాలవూల ఉయ్యాలో..

ఎంగిలి పూల బతుకమ్మ పాట మీకోసం 8/12

కష్యపాంగ ఋషులు ఉయ్యాలో.. అతి వశిష్టులు ఉయ్యాలో.. ఆకన్నియను చూచి ఉయ్యాలో.. బతుకనీయ తల్లి ఉయ్యాలో..

ఎంగిలి పూల బతుకమ్మ పాట మీకోసం 9/12

బతుకమ్మ యనిరంత ఉయ్యాలో.. పిలువగా అతివలు ఉయ్యాలో.. ప్రేమగా తల్లిదండ్రులు ఉయ్యాలో.. బతుకమ్మ యనుపేరు ఉయ్యాలో.. ప్రజలంత అందురు ఉయ్యాలో..

ఎంగిలి పూల బతుకమ్మ పాట మీకోసం 10/12

తాను ధన్యుడంటూ ఉయ్యాలో.. తన బిడ్డతో రాజు ఉయ్యాలో.. నిజ పట్నమునకేగి ఉయ్యాలో.. నేల పాలించగా ఉయ్యాలో..

ఎంగిలి పూల బతుకమ్మ పాట మీకోసం 11/12

శ్రీ మహా విష్ణుండు ఉయ్యాలో.. చక్రకుండను పేర ఉయ్యాలో.. రాజు వేషమ్మున ఉయ్యాలో.. రాజు ఇంటికి వచ్చి ఉయ్యాలో..

ఎంగిలి పూల బతుకమ్మ పాట మీకోసం 12/12

ఈ ఇంట మునియుండి ఉయ్యాలో.. అతిగా బతుకమ్మను ఉయ్యాలో..

Updated at - Oct 02 , 2024 | 02:38 PM