BFSI స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - Sep 26 , 2024 | 11:31 AM
హైదరాబాద్: జేఎన్‌ఎఫ్‌ఏయూలో బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి లేక యువత వ్యసనాలకు అలవాటు పడుతున్నారనే విషయాన్ని గుర్తించామని, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి సేవించే వారే కాదు.. అమ్మేవాళ్ళు కూడా ఇంజినీరింగ్ చదివిన వారు ఉన్నారన్నారు. యువతకు ఉద్యోగ కల్పనపై... ఆ బాధ్యత మేము తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం , కమిషనర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు.
Updated at - Sep 26 , 2024 | 11:32 AM