Rain Alert: వరద ముంపులో మోకిలా గ్రామం..

ABN, Publish Date - Sep 03 , 2024 | 12:20 PM

రంగారెడ్డి జిల్లా: శంకర్‌పల్లి మండలం, మోకిలా గ్రామ పరిధిలోని అత్యంత విలాసవంతమైన ‘లా పొలామా’ కమ్యూనిటీలోకి వరద ముంచెత్తింది. ఇక్కడ 212 విల్లాలున్నాయి. మొత్తంగా వెయ్యిమంది వరకు ఉంటున్నారు. ఇక్కడ రూ.3 కోట్ల నుంచి గరిష్ఠంగా రూ.6 కోట్ల వరకు వెచ్చించి విల్లాలు కొనుక్కున్నారు. భారీ వర్షాల కారణంగా మోకాలి లోతు వరద నిలిచింది. లోపల రోడ్లన్నీ మునిగిపోయి చెరువును తలపించాయి. కమ్యూనిటీలోకి వెళ్లే దారులన్నీ బంద్‌ అయ్యాయి. లోపల 12 విల్లాల్లోకైతే ఇళ్లలోకి కూడా నీళ్లొచ్చాయి. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆ ప్రాంతంలో పర్యటించారు.

Rain Alert: వరద ముంపులో మోకిలా గ్రామం.. 1/6

మోకిలా గ్రామ పరిధిలోని అత్యంత విలాసవంతమైన ‘లా పొలామా’ కమ్యూనిటీలోకి ముంచెత్తిన వరద..

Rain Alert: వరద ముంపులో మోకిలా గ్రామం.. 2/6

మోకిలా ‘లా పొలామా’ లో నీట మునిగిన ప్రాంతాని పరిశీస్తున్న స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య..

Rain Alert: వరద ముంపులో మోకిలా గ్రామం.. 3/6

విలాసవంతమైన విల్లాల లోపల రోడ్లన్నీ మునిగిపోయి చెరువును తలపిస్తున్న దృశ్యం.

Rain Alert: వరద ముంపులో మోకిలా గ్రామం.. 4/6

నీట మునిగిన ప్రాంతంలో కారులో ప్రయాణిస్తూ పరిశీస్తున్న స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య..

Rain Alert: వరద ముంపులో మోకిలా గ్రామం.. 5/6

మోకిలా గ్రామ పరిధిలోని అత్యంత విలాసవంతమైన ‘లా పొలామా’ కమ్యూనిటీలో చెరువులు తలపిస్తున్న రోడ్లు..

Rain Alert: వరద ముంపులో మోకిలా గ్రామం.. 6/6

భారీ వర్షానికి విల్లాల్లోకి వచ్చిన వరద నీటిని బయటకు పంపేందుకు ప్రహరీ గోడను కొంతమేర యంత్రాలతో పగులగొడుతున్న దృశ్యం.

Updated at - Sep 03 , 2024 | 12:20 PM