ఈ 8 టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..!

ABN, Publish Date - Oct 02 , 2024 | 01:23 PM

ఫ్యాటీ లివర్ కాలేయాన్ని దెబ్బతీసే ఆరోగ్య సమస్య. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. దీనిని ఫ్యాటీ లివర్ అని అంటారు. ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయం పనితీరు దెబ్బతింటుంది. ఇది శరీరంలో ఇతర కార్యకలాపాలకు ఆటంకంగా మారుతుంది.

ఈ 8 టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..! 1/9

ఫ్యాటీ లివర్ సమస్య అస్సలు రావద్దని భావిస్తే.. 8 టిప్స్ ఫాలో అవ్వాలని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

ఈ 8 టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..! 2/9

బరువు.. అధిక బరువు కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది. అధిక బరువు ఉన్నవారిలో చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా కాలేయానికి ముప్పు పొంచి ఉంటుంది. బరువు తగ్గడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్య రాకుండా చేసుకోవచ్చు.

ఈ 8 టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..! 3/9

ఆహారం.. తీసుకునే ఆహారాన్ని బట్టే ఆరోగ్యం ఉంటుంది. అధిక కేలరీలు, వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ మొదలైనవి కాలేయాన్ని దెబ్బతీస్తాయి. జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. వీటిని తినడం మానేయాలి. పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి.

ఈ 8 టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..! 4/9

వ్యాయామం.. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారికి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే వ్యాయామం చేస్తుంటే శరీరంలో కొవ్వు బర్న్ కావడంలో సహాయపడుతుంది.

ఈ 8 టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..! 5/9

కాఫీ.. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కాలేయంలోని కొవ్వును బర్న్ చేయడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే కాఫీని మితంగా తీసుకోవాలి.

ఈ 8 టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..! 6/9

మిల్క్ తిస్టిల్.. ఇది కుసుమ జాతికి చెందిన మొక్క. దెబ్బతిన్న కాలేయానికి చికిత్స చేయడానికి పేగు సమస్యలు నివారించడానికి ఇది సహాయపడుతుంది. వైద్యుల సలహా మేరకు దీన్ని వాడితే కాలేయ సమస్యలు తగ్గుతాయి.

ఈ 8 టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..! 7/9

చక్కెర.. శుద్ది చేసిన చక్కెర ఊబకాయానికి కారణం అవుతుంది. కాలేయం సహా మొత్తం ఆరోగ్యానికి చేటు చేస్తుంది. చక్కెరకు బదులు బెల్లం, తేనె వంటి సహజ తీపి పదార్థాలను తీసుకోవాలి.

ఈ 8 టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..! 8/9

కాలేయ చికాకులు.. అనారోగ్యకర ఆహారాలు తీసుకోవడం, కన్ స్ట్రక్షన్ పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లడం, కాలేయాన్ని దెబ్బతీసే టాక్సిన్లకు గురికావడం మొదలైనవాటికి దూరంగా ఉండాలి.

ఈ 8 టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..! 9/9

విటమిన్లు.. విటమిన్-ఎ, విటమిన్-సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సిట్రిక్ పండ్లు, ఆకుకూరలు తీసుకుంటే కాలేయం సేఫ్ గా ఉంటుంది.

Updated at - Oct 02 , 2024 | 01:23 PM