ఈ 6 ఆహారాలను రాత్రంతా నానబెట్టిన తరువాతే తినాలి.. ఎందుకంటే..!

ABN, Publish Date - Aug 01 , 2024 | 10:08 AM

ఆహారమే ఆరోగ్యం అంటారు. ఈ ఆహారమే శరీరానికి శక్తి వనరు కూడా. అయితే ఆహారాన్ని తీసుకునే విధానం మీద అది శరీరానికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. కొన్ని ఆహారాలు నేరుగా తినవచ్చు, మరికొన్ని ఆహారాలు ఉడికించి తినవచ్చు. ఇంకొన్ని ఆహారాలు నానబెట్టి తినవచ్చు. ఇలా చేయడం వల్ల ఆహరంలో పోషకాలు పెరుగుతాయి. ముఖ్యంగా 6 రకాల ఆహారాలను రాత్రంతా నానబెట్టి తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో.. ఎందుకు అలా తినాలో తెలుసుకుంటే..

 ఈ 6 ఆహారాలను రాత్రంతా నానబెట్టిన తరువాతే తినాలి.. ఎందుకంటే..! 1/6

చియా విత్తనాలు.. చియా విత్తనాలు రాత్రంతా నానబెట్టిన తరువాత తినాలి. రాత్రంతా నానితే ఇవి జెల్ రూపంలోకి మారి మంచి ప్రయోజనాలు చేకూరుస్తాయి. మెరుగైన ఫలితం ఉంటుంది.

 ఈ 6 ఆహారాలను రాత్రంతా నానబెట్టిన తరువాతే తినాలి.. ఎందుకంటే..! 2/6

బాదం.. బాదం రాత్రంతా నానబెట్టి తింటే తేలికగా జీర్ణమవుతాయి. వేడి చేయవు. పోషక విలువలు కూడా పెరుగుతాయి.

 ఈ 6 ఆహారాలను రాత్రంతా నానబెట్టిన తరువాతే తినాలి.. ఎందుకంటే..! 3/6

అవిసె గింజలు.. అవిసె గింజలు కూడా నానిన తరువాత జెల్ రూపంలోకి మారతాయి. నానడం వల్ల వీటిలో పోషకాలు పెరుగుతాయి.

 ఈ 6 ఆహారాలను రాత్రంతా నానబెట్టిన తరువాతే తినాలి.. ఎందుకంటే..! 4/6

పప్పులు.. కందిపప్పు, శనగపప్పు, కిడ్నీ బీన్స్, బొబ్బర్లు ఇలా ఏవైననా సరే.. వండటానికి కనీసం కొన్ని గంటల ముందే నానబెట్టాలి. వీటిల పైటిక్ యాసిడ్ ఉంటుంది. నానబెట్టడం వల్ల ఇది తగ్గిపోతుంది. సులభంగా జీర్ణం కావడంలో సహాయపడుతుంది.

 ఈ 6 ఆహారాలను రాత్రంతా నానబెట్టిన తరువాతే తినాలి.. ఎందుకంటే..! 5/6

శనగలు.. శనగలు మంచి ప్రోటీన్ ఆహారం. కానీ వీటిని రాత్రంతా నానబెట్టిన తరువాత వండుకోవాలి. ఇది సులభంగా జీర్ణం కావడంలో సహాయపడుతుంది.

 ఈ 6 ఆహారాలను రాత్రంతా నానబెట్టిన తరువాతే తినాలి.. ఎందుకంటే..! 6/6

గుమ్మడి గింజలు.. వీటిలో కూడా ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని నానబెట్టిన తరువాత వీటిలో ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది. ఇది మెరుగైన ఫలితాలు ఇస్తుంది.

Updated at - Aug 01 , 2024 | 10:08 AM