ABN MD RK Big Debate Live Updates: చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డితో.. ఏబీఎన్ ఎండీ ‘ఆర్కే’ బిగ్ డిబేట్
ABN , First Publish Date - May 03 , 2024 | 06:50 PM
ముచ్చటగా మూడో పార్టీ రాజకీయాలు ఒంటబట్టినట్టేనా..? చేవేళ్లలో గెలిచారు.. ఓడారు.. ఈసారి విజయం సాధిస్తారా..? పార్టీ మారినా ప్రత్యర్థి మాత్రం మారలేదు.. బీజేపీ బలం కలిసొస్తుందా..? అర్బన్ ప్రజల అండ సరే.. గ్రామాల్లో ఎలా పాగా వేస్తారు..? ధనవంతుల బరి.. చేవెళ్లలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు..? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, సంచలన విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్‌లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం బిగ్ డిబేట్ చూసేయండి..
Live News & Update
-
2024-05-03T19:59:55+05:30
కేసీఆర్‌ను కొట్టలేరు!
మాణిక్కం ఠాగూర్‌కు రాజకీయాలపై అవగాహన లేదు
కాంగ్రెస్‌లోని చాలామంది నేతలు కేసీఆర్‌ను కొట్టలేరు
కేసీఆర్‌ను కొట్టేది రేవంత్ అని మొదట్నుంచీ నమ్మాను
కాంగ్రెస్‌లో మార్పు రావాలని చాలాసార్లు చెప్పా
6 కీలక అంశాలతో రిపోర్ట్ ఇచ్చా
కాంగ్రెస్‌కు రిజైన్ చేశాక రెండేళ్లు ఏ పార్టీలోనూ చేరలేదు
కరోనా సమయంలో చాలా సేవలు చేశా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
-
2024-05-03T19:56:37+05:30
నేను పార్టీలు మారలేదు!
కాంగ్రెస్ పార్టీలోలాగా బీజేపీలో ఎంజాయ్ చేయలేం
నేను పార్టీలు మారలేదు.. పార్టీలే మారాయి
కేసీఆర్ కుటుంబ పాలన సాగించారు
దేశంలో ఎప్పుడూ ఒకే కుటుంబం నుంచి..
ఐదుగురు పాలించలేదు
కుటుంబ పాలన చాలా దెబ్బకొట్టింది
అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరా..
కానీ కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయింది
బీఆర్‌ఎస్‌లోకి రావాలని కేటీఆర్ మూడేళ్లు బతిమాలారు
అప్పుడు చేవెళ్లలో వాళ్లకు అభ్యర్థి లేడు : కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
-
2024-05-03T19:53:35+05:30
అవును ఒక్కటంటే ఒక్కటే..!
బీఆర్‌ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశముంది
అధికారంలోకి వస్తే రియాలిటీ నుంచి బయటకు పోతారు
రాజకీయాల్లో కేసీఆర్ తప్పుదారి పట్టారు
టీఆర్‌ఎస్ పేరు మార్చడం తప్పు
అధికారం ఎవర్ని అయినా చెడగొడుతుంది
నా మాటల్లో తెలంగాణ, చేవెళ్ల యాస పోదు
కేంద్రమంత్రి పదవి తీసుకోవడానికి..
తెలంగాణ బీజేపీలో చాలామంది ఎదురు చూస్తున్నారు
బీజేపీలో కేంద్రమంత్రి పదవి వస్తే..
24 గంటలూ పనిచేయాల్సిందే : కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
-
2024-05-03T19:48:12+05:30
బీజేపీలో చేరికపై..!
బీజేపీలో చేరాలని మంత్రి శ్రీనివాస్ నుంచి ఆహ్వానం వచ్చింది
బండి సంజయ్ కూడా ఆహ్వానించారు
అప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ గురించి లోతుగా చదివా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
-
2024-05-03T19:45:22+05:30
మతతత్వ పార్టీ అనొద్దు!
బీజేపీని మత్తతత్వ పార్టీ అనడం తప్పు
నార్త్ ఇండియా పార్టీ, గుజరాతీ పార్టీ అనడం సరికాదు
ఆర్ఎస్ఎస్ పుట్టింది తెలంగాణలోనే
మతంతో సంబంధం లేకుండా బీజేపీ పాలసీలు ఉంటాయి
దేశంలో అందరికీ బియ్యం ఇస్తున్నారు
కోట్ల మంది ముస్లింలకు ముద్ర లోన్లు ఇచ్చారు
పీఎం ఆవాస్ యోజన కూడా అందరికీ అందింది
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు నాకు ఎలాంటి పదవి లేదు
ఇప్పుడు బీజేపీలో కూడా ఎలాంటి పదవి తీసుకోలేదు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
-
2024-05-03T19:35:31+05:30
రాజకీయాల్లోకి రావడానికి..!
తెలంగాణ అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చా
ఏ పార్టీలో ఉన్నా తెలంగాణకు మద్దతుగానే ఉంటా
మూసీ ప్రక్షాళన అన్న ఆలోచన సరైంది కాదు
మూసీపై రూ.50 వేల కోట్లు పెట్టడం అనవసరం
లోన్ల రీ షెడ్యూల్ మీదే రేవంత్ ఫోకస్ చేయాలి
మూసీపై, చెరువులపై నేను చాలా అధ్యయనం చేశా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
-
2024-05-03T19:30:02+05:30
అప్పులు తీర్చడంపైనే దృష్టి!
రాష్ట్రంతో సంబంధం లేకుండా ఢిల్లీ నుంచి మేనిఫెస్టో వచ్చింది
ఆరు గ్యారెంటీల అమలు అసాధ్యం
రుణమాఫీకి రూ.30 వేల కోట్లకు పైగా కావాలి
ప్రభుత్వం దగ్గర రూ.3 వేల కోట్లు కూడా లేవు
సీఎం అయ్యాక రేవంత్‌రెడ్డిని కలవలేదు
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మాత్రమే కలిశా
అప్పులు తీర్చడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది
కాళేశ్వరం అప్పులు తీరిస్తేనే ప్రభుత్వానికి ఊరట లభిస్తుంది
మోదీని రేవంత్ బడే భాయ్ అన్నారు
కేంద్రంతో రేవంత్ మంచి సంబంధాలు పెట్టుకున్నారు: కొండా
-
2024-05-03T19:28:44+05:30
ఆర్థిక పరిస్థితి బాగోలేదు!
తెలంగాణలో ఆర్థిక పరిస్థితి బాలేదు
కరెంట్, నీటి సమస్యలు ఉన్నాయి
ఇవన్నీ సీఎం రేవంత్‌కు ఇబ్బందికరమే
గతంలో కేసీఆర్ అప్పులు తీసుకున్నారు
ఇప్పుడు రేవంత్ వాటిని తీర్చాల్సి ఉంది
మోదీని రేవంత్ పెద్దన్న అంటారు
కేంద్రం రూ.9 వేల కోట్లు ఇచ్చింది
వాటితోనే ఇప్పుడు రాష్ట్రం నడుస్తోంది
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
-
2024-05-03T19:25:16+05:30
నేను ప్రతీకారం తీర్చుకోను!
ప్రధాని మోదీ ఓ సభకు వస్తారని ఆశిస్తున్నా
రంజిత్‌రెడ్డిపై ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం లేదు
రంజిత్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌లో చాలామంది వ్యతిరేకిస్తున్నారు
రంజిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు..
కాంగ్రెస్ నేతల్ని చాలా ఇబ్బంది పెట్టారు
పథకాలు కావాలంటే బీఆర్‌ఎస్‌లో చేరాలని ఒత్తిడి తెచ్చారు
రంజిత్‌రెడ్డిపై కాంగ్రెస్ నేతలు కక్షగట్టారు: కొండా
-
2024-05-03T19:15:22+05:30
రేవంత్ మంచి ఫ్రెండే..!
రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడే
రాజకీయం రాజకీయమే.. స్నేహం స్నేహమే..!
రేవంత్ పాలిటిక్స్‌లో చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు
రేవంత్‌ను కలిసి కంగ్రాట్స్ చెబుదాం అనుకున్నాను
ఎన్నికల టైమ్ కాబట్టి కలవలేకపోయాను..
కలిస్తే వార్తలు వేరేగా వస్తాయని కలవలేదు
పార్టీలు వేరైనా మంచి సత్సంబంధాలే ఉన్నాయి
రేవంత్ రుణమాఫీ చేస్తారని నమ్మకం లేదు
గోడపైన రేపు అని రాసినట్లుగానే.. ఆగస్టు-15 రాసుకోవాలి
అది ఈ ఏడాదా..లేకుంటే వచ్చే ఏడాదా అని తెలియదు : కొండా
-
2024-05-03T19:10:51+05:30
బిగ్ డిబేట్‌లో కొండా కీలక వ్యాఖ్యలు
2 నెలలుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాను
నన్ను ఓడించిన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు
రంజిత్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌లో పలువురు వ్యతిరేకిస్తున్నారు
కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువగా పరిచయాలు లేవు
పట్నం సునీతా మహేందర్‌రెడ్డి నాపై ప్రత్యర్థిగా నిలబడితే..
ఎంపీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉండేది: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
-
2024-05-03T18:52:30+05:30
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. ఇక తెలంగాణలోని కీలకమైన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం విషయానికొస్తే.. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్.. బీజేపీ పార్టీలు గట్టిగానే వ్యూహ రచన చేశాయి. అయితే.. ఎంతమంది వచ్చినా సరే తాను గెలిచి తీరుతానని బీజేపీ తరఫున పోటీచేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎలా గెలవబోతున్నారు..? ఆయన వ్యూహ రచన ఏంటి..? ముచ్చటగా మూడో పార్టీ రాజకీయాలు ఒంటబట్టినట్టేనా..? చేవేళ్లలో గెలిచారు.. ఓడారు.. ఈసారి విజయం సాధిస్తారా..? పార్టీ మారినా ప్రత్యర్థి మాత్రం మారలేదు.. బీజేపీ బలం కలిసొస్తుందా..? అర్బన్ ప్రజల అండ సరే.. గ్రామాల్లో ఎలా పాగా వేస్తారు..? ధనవంతుల బరి.. చేవెళ్లలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు..? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, సంచలన విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్‌లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం బిగ్ డిబేట్ చూసేయండి..