AP Politics: భీమవరంలో పోటీపై మళ్లీ ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!
ABN , Publish Date - Mar 12 , 2024 | 06:04 PM
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమి గెలుపే లక్ష్యంగా ఆ పార్టీల అధిపతులు వ్యూహరచన చేస్తున్నారు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. అటు అధికార పార్టీలోని అసంతృప్తులందర్నీ పార్టీల్లో చేర్చుకుంటూ.. ఇటు సీట్లు రాని వారిని బుజ్జగిస్తూ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా సముచిత స్థానం కలిపిస్తామంటూ చెబుతూ వస్తున్నారు...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమి గెలుపే లక్ష్యంగా ఆ పార్టీల అధిపతులు వ్యూహరచన చేస్తున్నారు. ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. అటు అధికార పార్టీలోని అసంతృప్తులందర్నీ పార్టీల్లో చేర్చుకుంటూ.. ఇటు సీట్లు రాని వారిని బుజ్జగిస్తూ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా సముచిత స్థానం కలిపిస్తామంటూ చెబుతూ వస్తున్నారు. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎక్కడ్నుంచి పోటీచేస్తారు..? పోటీ చేస్తే ఎమ్మెల్యేగానా..? ఎంపీగా బరిలోకి దిగుతారా..? ఎమ్మెల్యేగా అయితే ఎక్కడ్నుంచి..? ఎంపీగా అయితే ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు..? పోనీ ఎమ్మెల్యే, ఎంపీగా రెండు స్థానాల్లో పోటీచేస్తారా..? అనేదానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. ఇప్పటికే పవన్ ఎంపీగా పోటీచేస్తారని వార్తలు గుప్పుమనగా.. తాజాగా అసలు పోటీ ఎక్కడ్నుంచి అనేదానిపై స్వయంగా జనసేనానీయే స్పందించి ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు.
Big Breaking: బీజేపీలోకి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే..!
ఫుల్ క్లారిటీగా..!
2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీచేసిన పవన్.. రెండు స్థానాల్లో ఓటమిపాలయ్యారు. అయితే ఓడిన స్థానం నుంచి అది కూడా భీమవరం (Bhimavaram) నుంచే ఈసారి పోటీచేస్తారని ఎన్నికల హడావుడి మొదలైన నాటి నుంచి ప్రచారం జరిగింది. జనసేన వర్గాలు కూడా దాదాపు ఇదే విషయాన్ని అంగీరించాయి కూడా. అయితే.. సడన్‌గా భీమవరం నుంచి తాను పోటీచేయట్లేదని పవన్ కల్యాణ్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. మంగళవారం నాడు భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పులివర్తికి పార్టీ కండువా కప్పిన పవన్ కల్యాణ్ జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రామాంజనేయులు రాక జనసేనకు చాలా కీలకం అని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని కోట్లు పంచినా భీమవరంలో గెలుపు జనసేనదే అని చెప్పుకొచ్చారు. జనసేన గెలిస్తే భీమవరంలో డంపింగ్ యార్డును సరిచేస్తామన్నారు. భీమవరంలో రౌడీయిజం కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. గొడవలకు సై అంటే దానికి రెండింతలు సై అంటానని పవన్ చెప్పుకొచ్చారు. పవన్ చేసిన కామెంట్స్‌ను బట్టి చూస్తే.. సేనాని ఈసారి భీమవరం నుంచి పోటీచేయరని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు.. గెలవాల్సిందే, గొడవలకు సై అనే మాటలను వింటుంటే పవన్ ఇక్కడ్నుంచే పోటీచేస్తారని కొందరు జనసేన కార్యకర్తలు, నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా సరే ఇక్కడ్నుంచే పోటీ అని.. అందుకే చేరికలు అని మరోవైపు చర్చ నడుస్తోంది.
YS Jagan: ‘సిద్ధం’ చివరి సభలో జగన్ ప్రసంగం.. కంగుతిన్న వైసీపీ!
Pawan Kalyan: ఢిల్లీ పర్యటనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్!
పోటీ ఎక్కడ్నుంచి..?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పవన్.. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న ‘పిఠాపురం’ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని తెలుస్తోంది. పోటీస్థానం ఇదేనని దాదాపు కన్ఫామ్ అయ్యిందని.. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్న మాట. అయితే.. రెండ్రోజులుగా మళ్లీ భీమవరం నుంచే పోటీచేసి ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతామని నేతలు కొందరు లీకులు చేశారు. సీన్ కట్ చేస్తే.. పవన్ మాత్రం భీమవరం ప్రస్తావనే తేవట్లేదు.. పైగా ఇక్కడ్నుంచి అయితే పక్కాగా గెలవాలని మాత్రమే చెబుతున్నారు. మళ్లీ భీమవరం నుంచే పోటీ చేస్తా.. కచ్చితంగా గెలుస్తానన్న మాట పవన్ నోట రాకపోవడంతో జనసేన శ్రేణులు, పవన్ వీరాభిమానులు హర్ట్ అవుతున్న పరిస్థితి. పోనీ భీమవరం కాకుండా ఎక్కడ్నుంచి పోటీచేస్తారో కనీసం ప్రకటన చేయొప్పొచ్చు కదా అనే మాటలు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. పిఠాపురం నుంచి పోటీ అనేది ఒక ట్విస్ట్ అయితే.. తాజాగా కాకినాడ ఎంపీగా పోటీచేస్తారని పెద్ద ఎత్తునే ప్రచారం జరుగుతోంది. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత సీన్ మొత్తం మారిపోయిందని.. ఎంపీగా పోటీచేయాల్సిందేనని బీజేపీ అగ్రనేతల సూచనతో కాకినాడను పవన్ ఎంచుకోబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. పిఠాపురం అసెంబ్లీతో పాటు కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీచేస్తారనే టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. ఎంపీగా గెలిస్తే.. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాగానే మంత్రి పదవి కూడా ఇస్తారని ఢిల్లీ పెద్దలు చెప్పినట్లు సమాచారం. పవన్ ఇస్తున్న ఈ వరుస ట్విస్ట్‌లతో క్యాడర్ ఒకింత ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఫైనల్‌గా పవన్ ఎక్కడ్నుంచి పోటీచేస్తారో.. ఏం జరుగుతోందో వేచి చూడాలి మరి.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి