Delhi: అదానీ కుంభకోణంపై జేపీసీ: జైరాం రమేశ్
ABN , Publish Date - Apr 24 , 2024 | 02:26 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అదానీ కుంభకోణంపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేశ్ అన్నారు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అదానీ కుంభకోణంపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేశ్ అన్నారు. జేపీసీ ఏర్పాటుతోనే ఆ కుంభకోణం పూర్తిస్థాయిలో బట్టబయలవుతుందని మంగళవారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు.
పెట్టుబడుల పరిమితులను ఉల్లంఘించి అదానీ గ్రూప్ కంపెనీలలోకి నిధులు వచ్చినట్లు సెబీ గుర్తించిందని రాయిటర్స్ ప్రచురించిన కథనాన్ని ఆయన ప్రస్తావించారు. బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాల్లో అదానీకి కాంట్రాక్టులు దక్కేందుకు దేశ దౌత్య వర్గాల ద్వారా మోదీ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీతో అదానీకి ఉన్న బలమైన స్నేహబంధం ఆయన చేసిన చట్టవిరుద్ధ కార్యాకలపాలను ఇక కప్పిపుచ్చలేదన్నారు.