అనర్హులకు ఇనచార్జి బాధ్యతలు
ABN , Publish Date - Jun 02 , 2024 | 11:57 PM
సమగ్రశిక్ష ప్రాజెక్టులో అనర్హులకు ఇనచార్జి బాధ్యతలు అప్పగించారు. అడ్మిషన్ల వేళ సెక్టోరియల్ కేడర్‌కు చెందిన అత్యంత కీలకమైన జీసీడీఓ పోస్టు అసిస్టెంట్ సెక్టోరియల్‌కు ఇనచార్జిగా అప్పగించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.
సమగ్రశిక్షలో అసిస్టెంట్ సెక్టోరియల్‌కు
జీసీడీఓ బాధ్యతలు
నిబంధనలు గాలికి.. ఏపీసీ చర్యలు తీసుకునేరా...?
అనంతపురం విద్య, జూన 2: సమగ్రశిక్ష ప్రాజెక్టులో అనర్హులకు ఇనచార్జి బాధ్యతలు అప్పగించారు. అడ్మిషన్ల వేళ సెక్టోరియల్ కేడర్‌కు చెందిన అత్యంత కీలకమైన జీసీడీఓ పోస్టు అసిస్టెంట్ సెక్టోరియల్‌కు ఇనచార్జిగా అప్పగించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జీసీడీఓగా పనిచేస్తున్న మహేశ్వరి ఇటీవల చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నారు. గతనెల 30వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవుపై వెళ్లినట్టు సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేశారు. అసిస్టెంట్ ఐఈడీగా పనిచేస్తున్న షమకు ఇనచార్జి జీసీడీఓ బాధ్యతలు అప్పగించారు. కేజీబీవీల్లో వేలాది మంది విద్యార్థినులు చదువుకుంటుండగా, వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 32 కేజీబీవీలను పర్యవేక్షించాల్సిన బాధ్యత జీసీడీఓగా పనిచేసే అధికారిదే. అందుకు మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులు మాత్రమే అర్హులు. అసిస్టెంట్ ఐఈడీగా పనిచేస్తున్న షమా గతంలో పీజీటీగా పనిచేశారు. పీజీటీ పోస్టు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు సమానం. ఎంఈఓ, హెచఎం కాకపోయినా ఆమెకు ఇనచార్జి బాధ్యతలు అప్పగించడం శోచనీయం. ఆమె అయిష్టంగా ఉన్నట్టు సమాచారం. జిల్లాలో మహిళా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు లేరన్నట్టుగా అనర్హులకు అప్పగించడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా జీసీడీఓ పోస్టు భర్తీలో సమగ్రశిక్ష అఽధికారులు అనర్హులకు అవకాశం ఇచ్చారన్న ఆరోపణలు మూటగట్టుకున్నారు. జూన నుంచి ఆగస్టు వరకు అడ్మిషన్లు జరుగుతాయి. అత్యంత కీలకమైన సమయంలో అనర్హులకు జీసీడీఓ బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వస్తున్నాయి. కొత్తగా నియమితులైన ఏపీసీ ఈ సమస్యకు ఎలా పరిష్కారం చూపుతారో చూడాలి.