Viral: గుజరాత్‌లో బయటపడిన 4.7 ఏళ్ల కోట్ల క్రితం నాటి పాము అవశేషాలు.. ఈ పాము కథేంటో తెలిస్తే..!
ABN , Publish Date - Apr 21 , 2024 | 02:33 PM
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో అత్యంత పురాతన పాముకు సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. కచ్ జిల్లాలోని పంధోరాకు సమీపంలో ఓ లిగ్నైట్ గని ఉంది. ఆ గని తవ్వుతున్నప్పుడు అతి పొడవైన పాముకు సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి.
గుజరాత్ (Gujarat)లోని కచ్ జిల్లాలో అత్యంత పురాతన పాముకు (Ancient snake) సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. కచ్ జిల్లాలోని పంధోరాకు సమీపంలో ఓ లిగ్నైట్ గని ఉంది. ఆ గని తవ్వుతున్నప్పుడు అతి పొడవైన పాముకు సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. ఈ అవశేషాలపై అధ్యయనం చేపట్టిన శాస్త్రవేత్తలు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రపంచంలో ఇప్పటివరకు బయటపడిన పాము అవశేషాల్లో అత్యంత పొడవైనది ఇదేనని తెలిపారు.
ఆ అవశేషాల ఆధారంగా ఆ పాము పొడవు దాదాపు 15 మీటర్ల పొడవు వరకు ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా వేస్తున్నారు. ఆ అవశేషాలు 4.7 కోట్ల ఏళ్లనాటి జీవికి సంబంధించినవని భావిస్తున్నారు. ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్లు సునిల్ వాజ్‌పేయీ, దేబ్‌జీత్ చేసిన ఈ అధ్యయనం గురించి ``నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్``లో ఒక కథనం ప్రచురితమైంది. ఈ పాముకు ``వాసుకి ఇండికస్`` (Vasuki Indicus) అనే పేరు పెట్టారు. పురాణాల ప్రకారం.. ఈ పేరును శివుడితో సంబంధమున్న పాము గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తుంటారు. ఈ అవశేషం మాడ్సోయిడే జాతికి చెందిన సర్పానిదని, 4.7 కోట్ల ఏళ్ల క్రితం భారత్‌లోనే జీవించేవని, పాముల్లో ఇవే అతి పెద్దవని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.
ప్రస్తుతం ``రెటిక్యులేటెడ్ పైథాన్`` అని పిలుస్తున్న పాము భూమిపై అతి పెద్ద పాములుగా చెలామణి అవుతున్నాయి. ఇవి ఆగ్నేయాసియా అంటే ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లో కనిపిస్తాయి. వీటి పొడవు 6.25 మీటర్లు. అయితే తాజాగా దొరికిన ఈ అవశేషం పొడవు 11 నుంచి 15 మీటర్ల వరకు ఉండొచ్చు. నిజానికి 2005లో తొలిసారి ఈ అవశేషాలు బయటపడ్డాయి. ప్రొఫెసర్ సునిల్ వాజ్‌పేయీ వీటిపై పరిశోధన జరిపారు. ఈ అవశేషాలు మొసలివి కావచ్చుని అనుకున్నారు. 2022 వరకు అవి సునిల్ ల్యాబ్‌లోనే ఉండిపోయాయి. ఆ తర్వాత దేబ్‌జీత్ రంగ ప్రవేశం చేసి అధ్యయనం కొనసాగించారు. ఇద్దరూ కలిసి ప్రయోగాలు ప్రారంభించి అది పాము అవశేషం అని కనుగొన్నారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోల్లోని తేడాలను కనిపెట్టండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..