Share News

AC Vs Cooler: ఏసీ లేదా కూలర్.. వేసవి వేడి తగ్గించడంలో ఏది బాగా పనిచేస్తుందంటే..!

ABN , Publish Date - May 31 , 2024 | 02:21 PM

వేసవికాలం ఎండలు చాలా దారుణంగా ఉంటున్నాయి. వీటిని అధిగమించడానికి ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు కొనుగోలు చేస్తారు. అయితే ఎండ వేడిమి తగ్గించడానికి ఏది బెస్ట్ గా పనిచేస్తుంది? ఏసీ లేదా కూలర్.. ఈ రెండింటి మధ్య ఉండే తేడాలేంటో తెలుసుకుంటే..

AC Vs Cooler: ఏసీ లేదా కూలర్..  వేసవి వేడి తగ్గించడంలో ఏది బాగా పనిచేస్తుందంటే..!

వేసవికాలం ఎండలు చాలా దారుణంగా ఉంటున్నాయి. వీటిని అధిగమించడానికి ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు కొనుగోలు చేస్తారు. అయితే ఎండ వేడిమి తగ్గించడానికి ఏది బెస్ట్ గా పనిచేస్తుంది? ఏసీ లేదా కూలర్.. ఈ రెండింటి మధ్య ఉండే తేడాలేంటో తెలుసుకుంటే..

విద్యుత్ వినియోగం..

ఎయిర్ కూలర్లు తక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటారు. ఈ కారణంగా తక్కువ విద్యుత్ తోనే ఇవి చల్లని గాలిని ఇస్తాయి. అయితే వేడి చాలా ఎక్కువ ఉంటే మాత్రం కూలర్లు తగినంత ప్రభావవంతంగా వేడిని తగ్గించవు.

ఏసీల విషయానికి వస్తే ఇవి ఎక్కువగా విద్యుత్ వినియోగించుకుంటాయి. కానీ ఎంత వేడి వాతావరణాన్ని అయినా ఇవి చల్లబరుస్తాయి. విద్యుత్ వినియోగం, విద్యుత్ బిల్లు గురించి ఆలోచన లేకపోతే ఏసీ లు చల్లదనం ఎక్కువ ఇస్తాయి.

మీకు తెలుసా..? ఈ భారతీయ నగరాల్లో మాంసాహారాన్ని బ్యాన్ చేశారు..!


ప్లేస్..

ఏసీలను ఒక చోట ఏర్పాటు చేస్తే ఇక ఆ తరువాత మళ్లీ ఇంకొక చోటుకు తరలించడం అంత సులువు కాదు. అయితే వీటిని గోడపై ఏర్పాటు చేస్తారు. కాబట్టి గదిలో ఖాళీ లేకపోయినా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.

ఎయిర్ కూలర్లు ఏసీల కంటే ఈ విషయంలో చాలా బెస్ట్. ఎందుకంటే వీటిని ఒక చోట నుండి మరొక చోటుకు మార్చడం చాలా సులువు. వీటిని డిజైన్ చేసిన తీరును బట్టి వీటిని పెట్టుకోవడానికి స్థలం కూడా మరీ అంత ఎక్కువ అవసరం లేదు.

చల్లదనం..

ఏసీలు పెద్ద గదులను కూడా చల్లబరిచే విధంగా ఉంటాయి. ఇవి గదిని మొత్తం చల్లబరుస్తాయి.

చల్లబరిచే విషయంలో ఎయిర్ కూలర్లు ఏసీలతో పోటీ పడలేవు. ఇవి నిర్ణీత ప్రాంతాన్ని మాత్రమే చల్లబరచగలుగుతాయి. గాలి వాటాన్ని బట్టి ప్రాంతానికి చల్లదనం వర్తిస్తుంది. కాబట్టి గది మొత్తం చల్లబడటం జరగదు.

ఈ 8 రహస్యాలను మరణం వరకు ఎవరికీ చెప్పకూడదట..!


ఖర్చు, నిర్వాహణ..

ఏసీలు అదిక ధర కలిగి ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడం, ఇంట్లో ఏర్పాటు చేయడం, వీటి వినియోగంలో నెలవారి విద్యుత్ బిల్లు ఇవన్నీ అధికంగానే ఉంటాయి. అయితే వీటిని ఒకసారి ఏర్పాటు చేసుకున్న తరువాత తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే పొదుపు చేయడం సులభమే..

ఎయిర్ కూలర్లు ఏసీ ల కంటే పొదుపుగా ఉంటాయి. వీటిని సాధారణంగా రూ. 10వేల లోపు కొనుగోలు చేయవచ్చు. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. విద్యుత్ బిల్లు కూడా మరీ అంత ఎక్కువ ఉండదు.

పిల్లలు చిన్నతనం నుంచే బాధ్యతగా ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 31 , 2024 | 02:21 PM