Animals: నీరు లేకుండా ఎక్కువ సమయం బతికే జీవుల గురించి తెలుసా..!
ABN , Publish Date - Feb 16 , 2024 | 01:20 PM
నీరు తాగకుండా మహా అయితే ఓ గంట ఉండగలరా.. మరీ దాహం వేస్తే కష్టమే.. నీళ్ళు తాగకుండా ఉండాలంటే పెద్ద ఛాలెంజ్ కిందే లెక్క. మరేమో ఈ జీవులు ఏకంగా ఏళ్ళ తరబడి నీళ్ళు తాగకుండా ఉండగలవట. అదీ సంవత్సర కాలమైనా సరే నీళ్ళు అవసరం లేదట. సగటున మానవ శరీరం చెమట, శ్వాస, విసర్జన ద్వా నీటిని కోల్పోతూ ఉంటాం. అలాగే నీటిని తీసుకుంటూ ఉంటాం. నీరు తాగకుండా మనిషి బ్రతాకాల్సి వస్తే మహా అయితే మూడురోజులు మాత్రమే ఉండగలడు. ఎడారి జీవుల్లో కొన్ని నీరు తాగకుండా సంవత్సరాల తరబడి జీవించగలవు. ముఖ్యంగా వీటిలో ఎడారి తాబేలు, కంగారూ ఎలుక, ముళ్ల డెవిల్, నీటిని పట్టుకుని దాచుకునే కప్ప, ఆఫ్రికన్ చేప, ఎడారి స్పెడ్ పుట్ టోడ్స్ వంటి జీవులు చాలా కాలం ఉండగలవు.
నీరు తాగకుండా మహా అయితే ఓ గంట ఉండగలరా.. మరీ దాహం వేస్తే కష్టమే.. నీళ్ళు తాగకుండా ఉండాలంటే పెద్ద ఛాలెంజ్ కిందే లెక్క. మరేమో ఈ జీవులు ఏకంగా ఏళ్ళ తరబడి నీళ్ళు తాగకుండా ఉండగలవట. అదీ సంవత్సర కాలమైనా సరే నీళ్ళు అవసరం లేదట. సగటున మానవ శరీరం చెమట, శ్వాస, విసర్జన ద్వా నీటిని కోల్పోతూ ఉంటాం. అలాగే నీటిని తీసుకుంటూ ఉంటాం. నీరు తాగకుండా మనిషి బ్రతాకాల్సి వస్తే మహా అయితే మూడురోజులు మాత్రమే ఉండగలడు. ఎడారి జీవుల్లో కొన్ని నీరు తాగకుండా సంవత్సరాల తరబడి జీవించగలవు. ముఖ్యంగా వీటిలో ఎడారి తాబేలు, కంగారూ ఎలుక, ముళ్ల డెవిల్, నీటిని పట్టుకుని దాచుకునే కప్ప, ఆఫ్రికన్ చేప, ఎడారి స్పెడ్ పుట్ టోడ్స్ వంటి జీవులు చాలా కాలం ఉండగలవు.. వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
కంగారు ఎలుక..
ఉత్తర అమెరికాకు చెందిన కంగారు ఎలుక ఎడారి వాతావరణంలో నివసించే ప్రత్యేకమైన జంతువులలో ఒకటి. ఇది నీరు లేకుండా జీవించగలదు. చిన్న చిట్టెలుక పొడవైన వెనుక కాళ్ళతో కంగారును తలపించేదిగా ఉంటుంది. ఇది ఆహారాన్ని వెతుకుతున్నప్పుడు వేగంగా దూకి వెళ్ళగలదు. పెద్ద చెవులతో ఉండే ఈ కంగారు ఎలుక మూత్రపిండాల ద్వారా శరీరంలోకి నీటిని తీసుకుంటుంది. శరీరం మీద కూడా ఈ ఎలుకకు జిడ్డుతో కూడిన కోటులాంటిది ఉంటుంది. ఇది చెమట పట్టకుండా చేస్తుంది.
వాటర్ హెూల్డింగ్ ఫ్రాగ్..
నీటిలో ఉండే కప్ప పైగా నీరులేకుండా ఉంటుంది.. చిత్రంగా లేదూ.. నీటిని పట్టుకునే కప్ప సైక్లోరానా ప్లాటిసెఫాలా.. సాధారణంగా ఇది ఆస్ట్రేలియాన్ ఎడారుల్లో కనిపిస్తుంది. కఠినమైన వాతావరణానికి తగినట్టుగా మట్టిలోకి తవ్వి కప్పుకుని ఉంటుంది. నీటిని గ్రహించే ప్రత్యకమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కప్ప మూత్రాశయం శరీర కణజాలాలలో నిల్వ చేస్తుంది. కప్ప మట్టిలోకి ప్రవేశించిన తర్వాత నీటిని కోల్పోకుండా ఉండటానికి చర్మంతో తయారు చేయబడిన కోకన్ లోకప్పబడి ఉంటుంది. ఇదే స్థితిలో చర్మాన్ని తింటుంది. ఇలానే చాలా సంవత్సరాలు ఉండగలదు.
ఊపిరితిత్తుల చేప..
చేపంటేనే నీటిలో ఉంటుంది. నీటిలో ఈత కొడుతుంది. మరిదేం చేప.. వెస్ట్ ఆఫ్రికన్ లంగ్ ఫిష్ మాత్రం ఒక అద్భతం. ఈ ప్రత్యేకమైన చేపలు దాదాపు 400 మిలియన్ సంవత్సరాల పాటు నీరు లేకుండా జీవిస్తున్నాయి కనుక వీటిని జీవన శిలాజాలు అని పిలుస్తారు. ఊపిరి తిత్తుల చేప నీటి నుంచి ఆక్సిజన్ ను పొందేందుకు సాధారణ చేపల్లానే మొప్పలు కలిగి ఉంటుంది. అయితే చేపలు గాలి నుంచి ఆక్సిజన్ తీసుకునే విధంగా ఉంటాయి. పొడి పరిస్థితుల్లో చేపలు బురదలోకి దూసుకుపోతాయి. బురద ఎండినా కూడా జీవిస్తుంది.
ఇది కూడా చదవండి; బల్లుల్ని ఇంటి నుంచి తరిమేసే ఇండోర్ మొక్కలు..!
ముళ్ళ డెవిల్..
థోర్నీ డెవిల్ (మోలోచ్ హోరిడస్), దీనిని సాధారణంగా ముళ్ల డ్రాగన్ అని కూడా పిలుస్తారు, ఇది సాధారణంగా సెంట్రల్ ఆస్ట్రేలియాలోని ఎడారి ప్రాంతాలలో కనిపిస్తుంది. ముళ్ళతో కూడిన డెవిల్ దాని శరీరంపై పొరలుగా ఉన్న పొలుసుల ద్వారా పొడి పరిస్థితులలో వర్షపాతం, మంచును సంగ్రహిస్తుంది, ఇది పొలుసుల మధ్య తేమ, నీటి బిందువులను బంధించడానికి వీలు కల్పిస్తుంది. అప్పుడు సేకరించిన నీరు చర్మం కింద నోటికి రవాణా చేస్తుంది. ఈ ప్రక్రియ నాలుక కదలికల ద్వారా ప్రారంభిస్తుంది. ఇది నోటి వెనుకకు నీటిని లాగడానికి అవసరమైన ఒత్తిడిని ఇస్తుంది. దీని కారణంగా చాలా కాలం ఈ జీవి ప్రత్యేకించి నీరు తాగకపోయినా బతకగలదు.
ఎడారి తాబేలు,.
తాబేలుకు నీరు ఆహారం కావాలి. కానీ ఈ ఎడారి తాబేలుకు నీరు అవసరం లేదట.. నైరుతి యునైటెడ్ స్టేట్స్‌లోని మోజావే ఎడారిలో కనిపించే గోఫెరస్ అగాస్సిజి, వాయువ్య మెక్సికోలోని సోనోరన్ ఎడారిలో కనిపించే గోఫెరస్ మోరాఫ్కై, ఎడారి తాబేలో రెండు ప్రధాన జాతులున్నాయి.. ఈ జాతులు నత్రజని ఆధారిత వ్యర్థాలు, యూరియా నీటిలో దాని బరువులో ఐదింట రెండు వంతుల వరకు మోయగల భారీ మూత్రాశయాన్ని ఉంటుంది. వాతావరణం తడిగా ఉన్న సమయంలో, ఎడారి తాబేలు వ్యర్థాలను విసర్జిస్తుంది. ఇదే సమయంలో నిల్వ కోసం అదనపు నీటిని తాగుతుంది. ఈ తాబేలు నీరు లేకుండా ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవించగలదు.