Mukesh Ambani: ముఖేష్ అంబానీతో పెళ్లి.. నీతా పెట్టిన ఒకే ఒక్క కండీషన్ ఏంటో తెలుసా?
ABN , Publish Date - Mar 23 , 2024 | 07:52 PM
ప్రస్తుతం ఎంతో వైభవోపేతమైన జీవితం గడుపుతున్న నీతా అంబానీ వివాహానికి ముందు ఓ సామాన్య యువతి. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఓ సాధారణ స్కూల్ టీచర్.
నీతా అంబానీ (Nita Ambani).. ప్రస్తుతం దేశంలోనే బడా వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ (Mukesh Ambani) భార్య. కొన్ని కోట్లకు అధిపతి. ఒంటి చేత్తో ఎన్నో సంస్థలను ఆమె నిర్వహిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఎంతో వైభవోపేతమైన జీవితం గడుపుతున్న నీతా వివాహానికి ముందు ఓ సామాన్య యువతి. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఓ సాధారణ స్కూల్ టీచర్ (Nita Ambani marriage).
పెళ్లికి ముందు నీతా అంబానీ పేరు నీతా దలాల్. నీతా ఓ భరతనాట్యకారిణి. రిలయన్స్ అధినేత ధీరూభాయ్ అంబానీ, కోకిలా బెన్ హాజరైన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో నీతా ప్రదర్శన ఇచ్చింది. నీతా నాట్యం చూసి ముగ్ధులైన ధీరూభాయ్ ఆమెను తన ఇంటి కోడలిగా చేసుకోవాలనుకున్నారు. తన పెద్ద కొడుకు ముఖేష్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. ఆ విషయం గురించి మాట్లాడేందుకు నేరుగా నీతా తండ్రికి ఫోన్ చేశారు. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త నుంచి పెళ్లి ప్రపోజల్ రావడంతో నీతా తండ్రి షాకయ్యారు. విషయం తెలుసుకుని నీతా కూడా ఆశ్చర్యపోయింది.
Viral Video: భారత్‌లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు.. చిప్స్ ఎలా తయారు చేస్తున్నాడో చూడండి.. నెటిజన్ల కామెంట్స్ ఏంటంటే..
అంత పెద్ద ధనిక కుటుంబానికి చెందిన ముఖేష్‌ను పెళ్లి చేసుకునేందుకు నీతా మొదట్లో సంశయించింది. తర్వాత తన అంగీకారాన్ని తెలిపింది. అయితే పెళ్లికి ముందు ముఖేష్‌కు నీతా ఓ షరతు విధించింది. పెళ్లి తర్వాత కూడా తాను స్కూల్ టీచర్‌గా కొనసాగుతానని చెప్పింది. అందుకు ముఖేష్ సంతోషంగా అంగీకరించడంతో పెళ్లి జరిగిపోయింది. అంత పెద్ద ధనిక కుటుంబానికి కోడలు అయిన తర్వాత కూడా నీతా రూ.800 జీతానికి పని చేసేది. కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం మానేసింది. ఆ తర్వాత నీతా ఆధ్వర్యంలోనే ముంబైలో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభమైంది. ఎంతో మంది ప్రముఖుల పిల్లలు ఆ స్కూల్‌లోనే చదువుకున్నారు.