Share News

Viral News: అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్.. వియత్నాంలో ఈ కొత్త ట్రెండ్‌కు కారణం ఏంటంటే..

ABN , Publish Date - Dec 03 , 2024 | 08:27 AM

కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గి చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. మన దేశంలోనే కాదు.. వియత్నాంలో కూడా ఇదే పరిస్థితి. అందుకే వారు దీనికి ఓ చిట్కా కనిపెట్టారు. తమ తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడానికి మరియు వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి అద్దెకు భాగస్వాములను నియమించుకుంటున్నారు.

Viral News: అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్.. వియత్నాంలో ఈ కొత్త ట్రెండ్‌కు కారణం ఏంటంటే..
Partners on Rent

సాధారణంగా ఓ వయసు వచ్చాక అమ్మాయిలు లేదా అబ్బాయిలపై పెళ్లి (Marriage) చేసుకోవాలనే ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి బంధుమిత్రుల నుంచి పెళ్లి గురించిన ప్రశ్నలు ఎదురవుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గి చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. మన దేశంలోనే కాదు.. వియత్నాంలో (Vietnam) కూడా ఇదే పరిస్థితి. అందుకే వారు దీనికి ఓ చిట్కా కనిపెట్టారు. తమ తల్లిదండ్రులను సంతోషంగా ఉంచడానికి, వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి అద్దెకు భాగస్వాములను నియమించుకుంటున్నారు. వియత్నాంలో ఇటీవల ఈ ట్రెండ్ విపరీతంగా పెరుగుతోంది (Partners on Rent).


30 ఏళ్ల మిన్ తు అనే యువతి తన కుటుంబ సభ్యుల నుంచి పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అయితే ఆమెకు నచ్చిన వ్యక్తి భాగస్వామిగా దొరకలేదు. దాంతో ఒక బాయ్‌ఫ్రెండ్‌ని ఇంటికి తీసుకు వెళ్లింది. బాయ్‌ఫ్రెండ్‌గా నటించేందుకు అతడికి డబ్బులు చెల్లించేందుకు డీల్ కుదర్చుకుంది. మిన్ తు కుటుంబం అతణ్ని అంగీకరించింది. ఆ వ్యక్తి మిన్ తో పాటు అప్పుడప్పుడు ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్తుంటాడు. ఇంటి పనులు, వంట పనులు కూడా చేస్తూ మిన్ కుటుంబ సభ్యలకు దగ్గరయ్యాడు. అక్కడ ఇలా ఎంతో మంది ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా సంప్రదిస్తే చాలు.. కావాల్సిన వాళ్లు దొరకుతున్నారు. 25 ఏళ్ల హుయ్ తువాన్ అనే వ్యక్తి ``ఫేక్ బాయ్‌ఫ్రెండ్``గా మారడాన్ని తన వ్యాపారంగా చేసుకున్నాడు.


కుటుంబ సభ్యులను కలిసేటపుడు, బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లేటపుడు, ఏదైనా ఫంక్షన్‌కు హాజరు కావాల్సి వచ్చినపుడు ఆ ఫేక్ బాయ్‌ఫ్రెండ్స్ లేదా ఫేక్ గర్ల్‌ ఫ్రెండ్స్‌ను తీసుకెళుతుంటారు. అయితే నిపుణులు ఈ పనిని ప్రమాదకర చర్యగా అభివర్ణిస్తున్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యలను కలిగిస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై చాలా మంది వియత్నాం వాసులు తమ స్పందనలను తెలియజేశారు. ``మంచి సంపాదన లేకుండా వివాహం చేసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో, అద్దెకు భాగస్వామిని తీసుకోవడం మంచి నిర్ణయం``, ``ఇది మీ తల్లిదండ్రులను సంతోషంగా ఉంచుతుంది. మీపై భారాన్ని తగ్గిస్తుంది``, ``ఈ అబద్ధం గురించి వారి తల్లిదండ్రులకు తెలిస్తే ఏం జరుగుతుంది`` అంటూ చాలా మంది స్పందించారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఈ కుక్కకు ఏమైంది.. పెళ్లి మండపంలో వధువుకు చుక్కలు చూపించిన పెట్ డాగ్..


Viral News: వావ్.. వంట మనిషి కోసం రెజ్యూమ్.. వెల్లువలా వస్తున్న జాబ్ ఆఫర్లు..


Viral Video: ఉక్కు శరీరం అంటే ఇదేనేమో.. అతడి దెబ్బకు స్టీల్ రాడ్ ఎలా వంగిపోయిందో చూడండి..


Viral Video: హవ్వ.. మెట్రోలో ఇదేం పని.. టవల్స్ కట్టుకుని మెట్రలో హల్‌చల్ చేసిన యువతులు.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 03 , 2024 | 08:27 AM