Puzzle: మీ కళ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకోండి!.. ఈ ఫొటోలో బ్రష్ ఎక్కడుందో 12 సెకెన్లలో కనిపెట్టండి..!
ABN , Publish Date - Mar 29 , 2024 | 06:28 PM
పజిల్స్, ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది (Brain Test).
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఒక ఎలుక, కొంగ ఓ ఇంట్లో టేబుల్ ముందు కూర్చుని తాగుతున్నాయి. ఆ ఫొటోలో ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. అయితే ఆ ఫొటోలో ఓ టూత్ బ్రష్ కూడా ఉంది. ఆ టూత్ బ్రష్ ఎక్కడ ఉందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 12 సెకెన్ల వ్యవధిలో ఆ టూత్ బ్రష్‌ను కనిపెట్టెస్తే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అని నమ్మొచ్చు. కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. టూత్ బ్రష్ ఎక్కడ ఉందో తెలిసిపోతుంది.