Puzzle: మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా ఉందో టెస్ట్ చేసుకోండి?.. ఈ ఫొటోలో నిజమైన కుక్క పిల్ల ఏదో కనిపెట్టండి..!
ABN , Publish Date - Mar 25 , 2024 | 05:16 PM
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి.
పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది (Brain Test).
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో కొన్ని కుక్క పిల్లలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఒక్కటే నిజమైన కుక్క పిల్ల. మిగిలినవన్నీ కుక్క పిల్లల బొమ్మలు. వాటిల్లో నిజమైన కుక్క పిల్ల కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 12 సెకెన్ల వ్యవధిలో ఆ కుక్క పిల్ల ఎక్కడ ఉందో కనిపెట్టెస్తే మీ బ్రెయిన్ చాలా షార్ప్ అని నమ్మొచ్చు. కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. నిజమైన కుక్క పిల్ల ఏదో తెలిసిపోతుంది.