Optical Illusion: మీ కళ్లకు టెస్ట్!.. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురు పిల్లలను 8 సెకెన్లలో కనిపెట్టండి..!
ABN , Publish Date - Apr 02 , 2024 | 11:06 AM
పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.
పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Opitcal Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది (Brain Test).
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఓ మహిళ రోడ్డుపై నడిచి వెళ్తోంది. ఆ ఫొటోలో మహిళ, రోడ్డు, చెట్లు కనిపిస్తున్నాయి. అయితే ఆ ఫొటోలో ఆ మహిళ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 8 సెకెన్ల వ్యవధిలో ఆ పిల్లలను కనిపెట్టెస్తే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్ అని నమ్మొచ్చు. కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ పిల్లలు ఎక్కడున్నారో తెలిసిపోతుంది.