Car Care Tips: కారు టైర్లలో నైట్రోజన్ గ్యాస్ ఎందుకు నింపాలి? ప్రమాదాలు జరుగకుండా కంట్రోల్ చేస్తుందా?
ABN , Publish Date - Feb 23 , 2024 | 10:51 AM
Nitrogen Gas for Car: వేసవి కాలం వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో స్కూళ్లకు హాలిడేస్ రాబోతున్నాయి. ఈ వేసవి సీజన్(Summer Holidays)లో తల్లిదండ్రులు ఇప్పటి నుంచే తమ పిల్లలతో కలిసి సరదాగా హాలిడేస్ ట్రిప్‌కు ప్లాన్ చేస్తుంటారు. ఇందుకోసం తమ కార్లను సిద్ధం చేసుకుంటారు. కారు(Car)లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.
Nitrogen Gas for Car: వేసవి కాలం వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో స్కూళ్లకు హాలిడేస్ రాబోతున్నాయి. ఈ వేసవి సీజన్(Summer Holidays)లో తల్లిదండ్రులు ఇప్పటి నుంచే తమ పిల్లలతో కలిసి సరదాగా హాలిడేస్ ట్రిప్‌కు ప్లాన్ చేస్తుంటారు. ఇందుకోసం తమ కార్లను సిద్ధం చేసుకుంటారు. కారు(Car)లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే చాలా మంది కారు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే, వేసవి(Summer Car Care) కారు ప్రయాణం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కారు టైర్లలో గాలి త్వరగా దిగిపోవడం, ఇంజిన్(Car Engine) హీటెక్కడం వంటివి జరుగుతుంది. అయితే, ప్రధానంగా కారు టైర్లలో గాలి అనేది చాలా కీలకం. కారు టైర్లలో నైట్రోజన్ వాయువును నింపుకోవాలని సూచిస్తుంటారు. మరి కారు టైర్లలో నైట్రోజన్ గాలినే ఎందుకు నింపాలి? దీని వలన కలిగే ప్రయోజనం ఏంటి? అనే కీలక వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
ఉష్ణోగ్రత 40-45 డిగ్రీలు ఉంటే?
వేసవిలో ఎక్స్‌ప్రెస్‌వే, జాతీయ రహదారి, రాష్ట్ర రహదారిపై ప్రయాణిస్తే.. 40 నుండి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కారు టైర్స్ వేడి అవుతాయి. దీని కారణంగా అందులో ఉండే గాలి సాంద్రత కూడా పెరుగుతుంది. టైర్ పగిలిపోయే ప్రమాదం పెరుగుతుంది. కారు టైర్ బలహీనంగా ఉంటే అది పగిలిపోవడం దాదాపు ఖాయమవడమే కాకుండా.. ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
నైట్రోజ్, సాధారణ గాలి మధ్య తేడా..
సాధారణ గాలి నైట్రోజన్ కంటే వేగంగా టైర్ నుంచి బయటకు వెళ్తుంది. దీని కారణంగా టైర్లలో గాలి మళ్లీ మళ్లీ నింపాల్సి వస్తుంది. అలాగే, వేసవిలో వాహనం అతిగా నడిపినప్పుడు సాధారణ గాలి మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. దీని కారణంగా టైర్ రిమ్, అలోయ్ వీల్స్ ప్రతికూలంగా ప్రభావితమవుతాయి. తద్వారా అవి త్వరగా పాడైపోతాయి.
నైట్రోజన్ ఎయిర్ ప్రయోజనాలు..
కారు టైర్లలో నైట్రోజన్ గాలిని నింపడం వలన టైర్ ఒత్తిడిని నిర్వహిస్తుంది. టైర్ లైఫ్ ఎక్కువ కాలం వచ్చేలా సహకరిస్తుంది. ఎక్కువ మైలేజీని వచ్చేలా చూస్తుంది. స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.