Share News

Diwali Special: ఇవి టపాసులు అనుకుంటే పప్పులో కాలేసినట్లే..

ABN , Publish Date - Oct 24 , 2024 | 10:56 AM

సాధారణంగా దీపావళి అంటే టపాసుల కోసం పిల్లలు మారాం చేస్తుంటారు. కొనే వరకు పట్టబడతారు. అదే దీపావళి టపాసులను తలపించే రూపంలో ఉండే చాక్లెట్లను చూస్తే పిల్లలు వదిలిపెడతారా.. నిజమే పైన ఫోటోలు ఉన్నవి టపాసులు కాదు.. దీపావళి టపాసుల్లా కనిపిస్తున్న చాక్లెట్లు. పిల్లలను ఆకర్షించేందుకు..

Diwali Special: ఇవి టపాసులు అనుకుంటే పప్పులో కాలేసినట్లే..
Diwali Chocolates

పైన ఫోటో చూడగానే ఏమినిపిస్తోంది. వెంటనే దీపావళి పండుగ గుర్తొస్తుందా.. దీపావళికి రకరకాల టపాసులు వచ్చాయనుకుంటున్నారా.. అయితే మీరు పొరపాటుపడినట్లే.. చూడటానికి టపాసులులా ఉన్నా.. అవి నిజం టపాసులు కాదు. కానీ వాటిని పిల్లలు చూస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు. సాధారణంగా దీపావళి అంటే టపాసుల కోసం పిల్లలు మారాం చేస్తుంటారు. కొనే వరకు పట్టబడతారు. అదే దీపావళి టపాసులను తలపించే రూపంలో ఉండే చాక్లెట్లను చూస్తే పిల్లలు వదిలిపెడతారా.. నిజమే పైన ఫోటోలు ఉన్నవి టపాసులు కాదు.. దీపావళి టపాసుల్లా కనిపిస్తున్న చాక్లెట్లు. ఈ చాక్లెట్లు పిల్లలనే కాదు పెద్దలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. దీపావళి స్పెషల్ చాక్లెట్లు టపాసులతో పోటీపడుతున్నాయి. ప్రస్తుతం ట్రెండ్ మారింది. పండుగలంటే ఒకరికి మరొకరు బహుమతులు ఇచ్చుకునే సంస్కృతి బాగా పెరిగింది. తక్కువ ధరలో దీపావళికి బహుమతులు ఇవ్వాలనుకునేవారికి ఈ గిఫ్ట్ ప్యాక్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. ఎవరైనా సడన్‌గా ఈ చాక్లెట్లను చూస్తే.. అవి టపాసులే అనుకుంటున్నారట. బాక్స్ ఓపెన్ చేస్తేకానీ అసలు విషయం తెలియడంలేదట.


దీపావళి నేపథ్యంలో..

దీపావళి అంటే దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరాధి రాష్ట్రాల్లో ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునే సంప్రదాయం ఉంటుంది. ఎక్కువమంది స్వీట్లను బహుమతులు ఇచ్చి, పుచ్చుకుంటారు. పిల్లలు ఎక్కువుగా ఉంటే చాక్లెట్ల బాక్సులను గిఫ్టులుగా ఇస్తుంటారు. దీంతో దీపావళి సందర్భంగా టపాసులను పోలి ఉన్న చాక్లెట్లు మార్కెట్‌లోకి కొన్ని సంస్థలు ప్రత్యేకంగా తీసుకొస్తున్నాయి. గిఫ్ట్ బాక్స్ రూపంలోనూ ఈ చాక్లెట్లు లభిస్తున్నాయి. భారతదేశంలో దీపావళికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈనేపథ్యంలో ఆకర్షణీయమైన గిఫ్ట్ ప్యాకింగ్ రూపంలో వస్తున్న చాక్లెట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


ఇంట్లోనే తయారీ..

ఈ మధ్య కాలంలో ఇంట్లోనే చాక్లెట్ల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. బయట దుకాణాల్లో కొనే చాక్లెట్లలో వాడే పదార్థాలపై అనుమానంతో హోమ్ మేడ్ చాక్లెట్లపై ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కొందరు మహిళలు ఇంట్లోనే చాక్లెట్లు తయారుచేసి, వాటిని ఆకర్షణీయంగా ప్యాక్ చేసి దుకాణాల్లో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం దీపావళి పండుగ నేపథ్యంలో టపాసులను పోలిఉండేలా తయారుచేస్తున్న చాక్లెట్లు వైరల్ అవుతున్నాయి. బయట దుకాణాలతో పోలిస్తే హోమ్ మేడ్ చాక్లెట్ల ధర తక్కువుగా ఉండటంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. బ్రాండింగ్ ప్రమోషన్ ఖర్చు తగ్గడంతో ఎంతో రుచిగా ఉండే చాక్లెట్లను తక్కువధరకే విక్రయిస్తున్నారు. పెద్ద పెద్ద దుకాణాల్లో ఎక్కవ ఖరీదుకు కొనడానికి బదులుగా ఎంతో రుచిగా ఉండే హోమ్ మేడ్ చాక్లెట్లు ఆన్‌లైన్‌లో, హోమ్ డెలివరీ విధానంలో లభిస్తున్నాయి.

Diwali Sweets.jpg

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 24 , 2024 | 02:17 PM