Diwali 2024: ఈ టిప్స్ పాటిస్తే క్షణాల్లో మీ ఇల్లు మెరిసిపోతుంది
ABN , Publish Date - Oct 23 , 2024 | 06:16 PM
దీపావళి వచ్చిందంటే ఇల్లు శుభ్రం చేసుకుని అందంగా అలంకరించుకోవడానికి మగువలు ఆసక్తి చూపిస్తారు. అయితే ఇంట్లో చాలా రోజులుగా పేరుకుపోయిన చెత్తను తొలగించడం సవాలే.
హైదరాబాద్: దీపావళి వచ్చిందంటే ఇల్లు శుభ్రం చేసుకుని అందంగా అలంకరించుకోవడానికి మగువలు ఆసక్తి చూపిస్తారు. అయితే ఇంట్లో చాలా రోజులుగా పేరుకుపోయిన చెత్తను తొలగించడం సవాలే. అయితే కొన్ని టిప్స్ అనుసరిస్తే మీ ఇల్లు మెరిసిపోతుంది. తక్కువ శ్రమతో క్షణాల్లో ఇల్లు శుభ్రం అయ్యే ఈ టిప్స్ మీకోసమే..
ఇంటి పని మొత్తాన్ని ఒకేసారి పెట్టుకోవద్దు. కిచెన్, బాత్రూమ్, స్టోర్ రూంలను ఒక్కొక్కటిగా శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల ఇల్లు మొత్తం గజిబిజిగా కనిపించకుండా ఉంటుంది. పని కూడా సులువుగా మారుతుంది.
ఒక గదిని స్టోర్ రూమ్‌గా ఉపయోగించండి. అవసరం లేని వస్తువులను ఆ రూంలో పడేయండి.
ఏడాదికి పైగా శుభ్రం చేయని తొలుత శుభ్రం చేయండి. అవసరం లేని వస్తువులను బయట పారేయండి. ఇందుకు ఓ నియమం ఉంది. సాధారణంగా 2 ఏళ్లలో ఒక్కసారి కూడా ఉపయోగించని వస్తువు భవిష్యత్తులో కూడా ఉపయోగపడదట. కాబట్టి, ఈ నియమాన్ని అనుసరించడం మంచిది.
గది మెరుస్తూ ఉండటానికి గోడలు, ఫ్యాన్, లైట్లు, ఫొటో ఫ్రేమ్‌లతో పాటు స్విచ్‌బోర్డ్, కప్‌బోర్డ్‌లను శుభ్రం చేయండి.
వంటగది చిందరవందరగా ఉంటుంది. గదిలో అవసరమైన వస్తువులే ఉంచి, గదిలో ఎక్కువ స్థలం కనిపించేలా చేయండి.
కిరాణా సామగ్రిని నిల్వ చేసే అలవాటును మార్చుకోండి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కిరాణా స్టోర్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ దొరుకుతున్నాయి.
ఇక బాత్రూమ్తోపాటు అందులోని తలుపులు, కిటికీలను కూడా శుభ్రం చేయండి. అలాగే, ఖాళీ టాయిలెట్ బాటిళ్లను విసిరేయండి.
బాత్రూంలో పాత సబ్బు, షాంపూ ఉంటే, వాటిని బట్టలు ఉతకడానికి, తుడుచుకోవడానికి లేదా ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చు. అనవసరమైన వస్తువులను పడేయండి.
ఇల్లంతా శుభ్రం చేశాక అలంకరించండి. ఇంట్లో చాపలు, కర్టెన్లు మార్చండి. తద్వారా ఇంటికి కొత్తందం వస్తుంది. ఇంటి ప్రాంగణంలో ఇండోర్ మొక్కలను పెంచండి. ఇంట్లో సువాసనగల కొవ్వొత్తులను, లైట్లను ఉంచండి. ఇది పండుగ అనుభూతిని, మనస్సుకు హాయినిస్తుంది.
Diwali 2024: దీపావళి ఏ రోజు? అక్టోబర్ 31 లేదా నవంబర్ 1?
For Latest News and National News Click here