Evening Habits : సాయంత్ర సమయాన్ని ఇలా మార్చుకుంటే.. రిజల్ట్ భలే ఉంటుంది..!
ABN , Publish Date - Mar 05 , 2024 | 03:31 PM
పడుకునే ముందు చేసే కొన్ని మరుసటి రోజు మానసిక స్థితి, శక్తి స్థాయిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ అలవాట్లే మనల్ని మంచి బాటలో నడిపేది. నిర్థిష్టమైన అలవాట్లతో నిర్థిష్టమైన జీవిన విధానం ఏర్పడుతుంది. విశాలమైన ఆలోచనలు, అభిరుచులు ఏర్పడతాయి.
పడుకునే ముందు చేసే కొన్ని పనులు మరుసటి రోజు మానసిక స్థితి, శక్తి స్థాయిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ అలవాట్లే మనల్ని మంచి బాటలో నడిపేది. ఈ అలవాట్లతోనే నిర్థిష్టమైన జీవిన విధానం ఏర్పడుతుంది. విశాలమైన ఆలోచనలు, అభిరుచులు ఏర్పడేది. రోజులో మనం చేసే పనులను కాస్త తగ్గించి అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే, ముఖ్యంగా సాయంత్ర సమయంలో కాస్త మార్చుకుంటే సరిపోతుంది.
రిఫ్లెక్టివ్ జర్నలింగ్..
విజయవంతమైన వ్యక్తులలో మంచి అలవాట్లే (Habits) ముందుగా చెప్పుకోవలసినవి. తరచుగా సాయంత్రాలు తమ సమయాన్ని నచ్చిన విషయాలమీద పెట్టడం వల్ల ఆలోచనలు, విజయాలు, అభివృద్ధి జరుగుతుంది.
టెక్నాలజీని అన్ ఫ్లగ్ చేయండి..
డిజిటల్ అనుసంధానించబడిన ప్రపంచంలో టెక్నాలజీ విస్తృతంగా పెరిగింది. కాబట్టి నోటిఫికేషన్ చెక్ చేసుకోవడం, పరధ్యానంలో మునిగిపోవడం ఇప్పటి రోజుల్లో మామూలుగా జరిగిపోతున్నదే. అయితే ఒత్తిడి నుంచి రీఛార్జ్ కావడానికి సాయంత్రవేళలు టెక్నాలజీని డిస్ కనెక్ట్ చేయడం మంచిది.
ఇది కూడా చదవండి: బ్రెడ్ ఫ్రూట్ గురించి విన్నారా? దీనిలో ఎన్ని పోషకాలంటే..!
మైండ్ ఫుల్ నెస్, మెడిటేషన్..
చాలామంది విజయవంతమైన వ్యక్తుల్లో విశ్రాంతి, మానసిక స్పష్టత కలగడానికి సాయంత్రాలు ధ్యానం, అభ్యాసం చేయడం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి అలవాటు మన జీవితాలలో కూడా ఒత్తిడిని తరిమివేస్తుంది.
ప్రణాళిక, ప్రాధాన్యత..
రాత్రి సమయంలో మరుసటి రోజు పనులు ఫ్లాన్ చేయడానికి సమయం కేటాయించాలి. దీనితో మరుసటి ఉదయం ప్రశాంతంగా ఉంటుంది.
ఆహారం విషయంలో కూడా..
పౌష్టికాహారంలో సాయంత్రం అల్పాహారం లేదా భోజనం తినడం విజయవంతమైన వ్యక్తులలో సాధారణంగా గమనించే అలవాటు. మంచి ఆహారంతో మంచి ఆరోగ్యం పొందవచ్చు.
కుటుంబం..
కుటుంబంలోని వ్యక్తులే మన బలం.. బలహీనత. వారితో సమయాన్ని గడపడం, విలువైన చర్చలు, సంభాషణలు బంధాలను దృఢంగా మారుస్తాయి.
ఇవి కూడా చదవండి:
నోటి ఆరోగ్యాన్ని పెంచే లవంగాలను గురించి తెలుసా..100 గ్రాముల లవంగాల్లో..!
ఆహారంతో పొటాషియం స్థాయిలను ఎలా పెంచాలి..!
యాపిల్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..!
నిద్రవేళకు..
పడుకునే ముందు చాలా వరకూ స్క్రీన్ ఆన్ చేసి గంటలు గంటలు గడుపుతారు. అసలు ఇక్కడే సగం నిద్ర పోతుంది. నిద్రకు ఉపక్రమించినా నిద్ర పట్టని పరిస్థతిలోకి వెళతారు. మానసిక స్థితి కూడా నిబ్బరంగా ఉండదు. ఈ బ్లూ కిరణాలు నిద్రను భంగం కలిగించడమే కాకుండా అనేక మానసిక సమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి నిద్రపోయే ముందు టీవీ, ఫోన్, ట్యాబ్ వంటి స్క్రీన్స్ చూడకపోవడం మంచిది.