Eye Test: ఛాలెంజ్ చేస్తారా? 8సెకెండ్లలో ఈ ఫ్లెమింగోల మధ్య దాక్కున్న అమ్మాయిని గుర్తుపడితే మీరే తోపు..!
ABN , Publish Date - Jan 30 , 2024 | 01:26 PM
మీ కంటిచూపు ఎంత చురుగ్గా ఉందో.. దాని సామర్థ్యం ఏమిటో ఈ ఛాలెంజ్ తేల్చేస్తుంది.
సర్వేద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. శరీరంలో కళ్లు చాలా ప్రధానమైనవి. కంటిచూపు లేకపోతే ప్రపంచం మొత్తం చీకటేనేమో అనిపిస్తుంది. ఒకప్పుడు కళ్లజోడు వృద్దులు మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు చిన్నపిల్లల నుండి అందరూ వాడుతున్నారు. దృష్టి సమస్యలను అన్ని వయసుల వారు ఎదుర్కొంటున్నారు. మీ కంటిచూపు ఎంత చురుగ్గా ఉందో.. దాని సామర్థ్యం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికి ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్ లు చాలా బాగా దోహదం చేస్తాయి. అలాంటి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కంటిచూపు సామర్థ్యాన్ని కనుక్కోవడానికే కాదు, దాన్ని పెంచుకోవడానికి కూడా కొన్నిఫొటోలు సహాయపడతాయి. ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్ లు ఈ కోవకు చెందినవే. ఫొటోలో కొన్ని ఫ్లెమింగో పక్షులు కనిపిస్తాయి. ఇవి నీటి సరస్సులో తామర పువ్వుల మధ్య ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ పక్షుల మధ్య ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పక్షుల మధ్య ఎక్కడ దాక్కుందో కేవలం 8 సెకెన్లలో చెప్పేయాలి. ఇలా చెబితే మీ కంటి చూపు తోపు లెక్క ఉందని అర్థమట.
ఇది కూడా చదవండి: ఎర్ర కందిపప్పు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాల లిస్ట్ ఇదీ..!
8సెకెన్లలో ఫ్లెమింగోల మధ్య ఉన్న అమ్మాయిని కేవలం 1శాతం మంది చెప్పగలుగుతారని, మిగిలిన వారందరూ ఇందులో ఫెయిల్ అవుతారని అంటున్నారు.ఈ ఫొటోలో మీకు ఎక్కడైనా అమ్మాయి 8సెకెన్లలో కనిపిస్తుందేమో ఒక సారి ఛాలెంజ్ తీసుకోండి.
ఇది కూడా చదవండి: Viral: ఐఐఎంలో చదువుతున్న కొడుకుకు ఉత్తరం రాసిన తల్లి.. అందులో ఆమె కొడుకుకు ఇచ్చిన సలహాలేంటంటే..!
మరిన్ని ప్రత్యేక వార్తలకోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.