Gardening Tips: వర్షాకాలంలో ఈ పూల మొక్కలు నాటండి.. తోట కళకళలాడుతుంది..!
ABN , Publish Date - Jul 09 , 2024 | 12:44 PM
చెట్లు, మొక్కలు పెంచే అభిరుచి ఉన్నవారికి వర్షాకాలం చాలా మంచిది. ఈ సీజన్ లో కొత్త మొక్కలు నాటడానికి చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి ముందు ఏ మాత్రం ఖాళీ స్థలం ఉన్నా, వేసవి ఎండలకు ఇంటి తోట వాడిపోయి కళ కోల్పోయినా ఈ వర్షాకాలంలో దానికి తిరిగి పూర్వపు శోభను తీసుకురావచ్చు.
చెట్లు, మొక్కలు పెంచే అభిరుచి ఉన్నవారికి వర్షాకాలం చాలా మంచిది. ఈ సీజన్ లో కొత్త మొక్కలు నాటడానికి చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి ముందు ఏ మాత్రం ఖాళీ స్థలం ఉన్నా, వేసవి ఎండలకు ఇంటి తోట వాడిపోయి కళ కోల్పోయినా ఈ వర్షాకాలంలో దానికి తిరిగి పూర్వపు శోభను తీసుకురావచ్చు. పూల మొక్కలు తోటకు ఎంత అందాన్ని ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ కింది 5 రకాల మొక్కలు నాటితే వర్షాలకు మొక్కలు పువ్వులతో కళకళలాడతాయి. అవేంటో తెలుసుకుంటే..
5ఏళ్ల లోపు పిల్లలకు ఈ 5 విషయాలు తప్పక నేర్పించాలి..!
మందార..
మందార పువ్వులను వర్షాకాలంలో నాటితే చాలా బాగా ఎదుగుతుంది. సాధారణంగా సూర్యరశ్మి, నీరు బాగా అందుతూ ఉంటే సంవత్సరంలో ఏ సీజన్ లో అయినా దీన్ని నాటవచ్చు. కానీ వర్షాకాలం మాత్రం పువ్వులు పూయడానికి అనువుగా ఉంటుంది.
మల్లె..
మల్లె పువ్వులు సాధారణంగా వేసవిలో పూస్తుంటాయి. అయితే ఉత్తర భారతదేశంలో జూలై- ఆగస్టులో మల్లె మొక్కలు నాటితే మంచిది. ఇక దక్షిణ భారతదేశంలో ప్రజలు అయితే జూలై-డిసెంబర్ నెలల్లో మల్లె మొక్కలు నాటడం ఉత్తమం.
ఒలియాండర్..
చలికాలం తప్పిస్తే ఏడాది పొడవునా ఏ సమయంలో అయినా ఒలియాండర్ మొక్కను నాటవచ్చు. కానీ వర్షాకాలం ఈ మొక్కను నాటడానికి మరింత మంచిది.
Phool Makhana: ఫూల్ మఖానా ఇలా తినండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!
బిళ్ల గన్నేరు..
బిళ్ల గన్నేరు మొక్క ఒక సతత హరిత మొక్క. ఇది ఎప్పుడూ వికసిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో దీనికి పువ్వులు బాగా పూస్తాయి. వర్షాకాలంలో నాటితే ఇది సులభంగా ఎదుగుతుంది. దీన్ని మడగాస్కర్, సదా బాహర్ అని కూడా అంటారు. ఇది గులాబీ, తెలుపు, ఊదా రంగులలో ఉంటుంది.
బంతి పూలు..
బంతి పువ్వులను తోటలోనూ, ఇంటి ముందు ఉండే ఖాళీ స్థలంలోనూ నాటవచ్చు. దీని సువాసన చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. జూన్-జూలై నెలల మధ్యలో దీని విత్తనాలను నాటవచ్చు.
Period Cramps: పీరియడ్స్ సమయంలో కడుపులో తిమ్మిరికి చెక్ పెట్టే టీలు ఇవి..!
Migraine Vs Sleeping: మైగ్రేన్ ఉన్నవారికి ప్రశాంతమైన నిద్ర రావాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.