Hyderabad: ముంబై, బెంగళూరు కంటే హైదరాబాద్ ఉత్తమం.. యువతి చెప్పిన 5 కారణాలపై నెటిజన్ల స్పందన ఏంటంటే..
ABN , Publish Date - Apr 10 , 2024 | 01:13 PM
మన దేశంలో ఎన్నో నగరాలు ఉన్నాయి. ఒక్కో నగరానికి తనదైన విభిన్న సంస్కృతి, చరిత్ర, ప్రత్యేకతలు ఉంటాయి. అందమైన ప్రకృతికి, వాతావరణానికి నెలవైన నగరాలు కొన్ని ఉన్నాయి. మరికొన్ని తీవ్రమైన ట్రాఫిక్, కాలుష్యం, కాస్ట్ ఆఫ్ లివింగ్‌తో ఇబ్బంది పెట్టే నగరాలు.
మన దేశంలో ఎన్నో నగరాలు (Cities) ఉన్నాయి. ఒక్కో నగరానికి తనదైన విభిన్న సంస్కృతి, చరిత్ర, ప్రత్యేకతలు ఉంటాయి. అందమైన ప్రకృతికి, వాతావరణానికి నెలవైన నగరాలు కొన్ని ఉన్నాయి. మరికొన్ని తీవ్రమైన ట్రాఫిక్, కాలుష్యం, కాస్ట్ ఆఫ్ లివింగ్‌తో ఇబ్బంది పెట్టే నగరాలు. అయితే అందులో ఏ నగరం ఉత్తమం అనే డిబేట్ వచ్చినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తారు. తాజాగా ఓ యువతి తనకు హైదరాబాద్ (Hyderabad) ఎందుకు ఇష్టమో చెబుతూ 5 కారణాలను వెల్లడించింది.
``నేను హైదరాబాద్‌లో సంవత్సరం పాటు నివసించాను. ముంబై (Mumbai), బెంగళూరుల (Bengaluru)తో పోల్చుకుంటే నేను ఎప్పుడూ హైదరాబాద్‌నే ఉత్తమం అంటాను. దానికి కారణాలు.. తక్కువ ట్రాఫిక్ (ఇతర నగరాలతో పోలిస్తే), విమానాశ్రయానికి ఉత్తమ రహదారి, ప్రతిచోటా పచ్చదనం, సాటి లేని నగర సౌందర్యం, సాటిలేని ఆహారం. ఈ నగరానికి మరింత ప్రచారం కావాలి`` అంటూ @ShwetaKukreja అనే ట్విటర్ యూజర్ ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ పోస్ట్‌ను 8 లక్షల మంది వీక్షించారు. కొందరు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ``హైదరాబాద్ కంటే బెంగళూరు చల్లగా ఉంటుంది``, ``ముంబైలోలాగ అమ్మాయిలు రాత్రి 3 గంటలకు కూడా బయట తిరగగలరా``, ``ముంబైలో అమ్మాయిలు తమకు నచ్చిన బట్టలు వేసుకుని ఫ్రీగా తిరగగలరు``, ``ఎవరినీ అనుమానించకుండా ఇళ్లు అద్దెకు ఇవ్వడంలో ముంబై వాసులు గొప్పవారు``, ``ఇలా హైప్ ఇచ్చి హైదరాబాద్‌ను కూడా ముంబై, బెంగళూరులా మార్చవద్దు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..