Viral: తులం బంగారం ధర 1959లో ఎంతో తెలుసా? విపరీతంగా వైరల్ అవుతున్న పాత గోల్డ్ బిల్..!
ABN , Publish Date - Aug 04 , 2024 | 02:55 PM
ఏ వేడుక వచ్చినా, పండగ అయినా చాలా మంది బంగారం కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. సందర్భం ఏదైనా సరే బంగారం కొనే వారికి కొదవలేదు. బంగారం ధర ఎంత పెరిగినప్పటికీ కొనే వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 60 వేలకు పైనే ఉంది.
ఏ వేడుక వచ్చినా, పండగ అయినా చాలా మంది బంగారం (Gold) కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. సందర్భం ఏదైనా సరే బంగారం కొనే వారికి కొదవలేదు. బంగారం ధర (Gold Rate) ఎంత పెరిగినప్పటికీ కొనే వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 60 వేలకు పైనే ఉంది. అయితే 1959లో బంగారం ధర (Gold bill of 1959) ఎంత ఉండేదో తెలుసా? అప్పటి బంగారం బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు (Viral News).
zindagi.gulzar.h అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ బిల్లుకు సంబంధించిన ఫొటో షేర్ అయింది. అది 1959వ సంవత్సరం నాటి బిల్లు. ఆ బిల్లు ప్రకారం 1959లో 11.6 గ్రాముల (తులం) బంగారం ధర కేవలం రూ.113 మాత్రమే. ఆ సమయంలో బంగారం కొన్న ఓ వ్యక్తికి చెందిన కుటుంబ సభ్యులు తాజాగా ఆ బిల్లును ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దాదాపు 65 ఏళ్లలో బంగారం ధర రూ.113 నుంచి రూ.65 వేల వరకు ఎగబాకింది. ధరలో ఇంత వ్యత్యాసం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌కు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. 78 వేల మందికి పైగా ఈ పోస్ట్‌ను లైక్ చేశారు. ఈ పోస్ట్‌పై తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``సమయం వేగంగా కదులుతోంది``, ``అప్పటి ఆదాయం ప్రకారం చూసుకుంటే బంగారం కొనడం చాలా ఖరీదైన వ్యవహారం``, ``అప్పట్లో ప్రజల జీతం కూడా నెలకు 40 రూపాయలు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఆ బాలుడి సరదా ఓ మహిళ ప్రాణాలను ఎలా తీసిందో చూడండి..!
Viral Video: తమ్ముడూ.. ఇలా అయితే వధువు పారిపోతుందేమో.. పెళ్లిలో వరుడి తుఫాన్ డ్యాన్స్ చూడండి..!
Viral Video: ఐదు సింహాలు చుట్టుముడితే ఎలా ఉంటుంది.. ఓ హిప్పో ఏం చేసిందో చూడండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి