Share News

Hair Dye: తెల్లజుట్టు సమస్య వేధిస్తోందా? ఇంట్లోనే ఈజీగా ఇలా హెయిర్ డై చేసుకుని వాడండి.. ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు..!

ABN , Publish Date - Feb 04 , 2024 | 03:22 PM

ఇంట్లోనే ఈజీగా ఇలా హెయిర్ డై తయారుచేసుకుని వాడితే అద్బుతమైన ఫలితాలుంటాయి.

Hair Dye: తెల్లజుట్టు సమస్య వేధిస్తోందా? ఇంట్లోనే ఈజీగా ఇలా హెయిర్ డై చేసుకుని వాడండి.. ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు..!

తెల్లజుట్టు చాలామందిని వేధిస్తున్న సమస్య. నిండా 30ఏళ్ల వయసు పూర్తీ కాకముందే తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు చాలామంది ఉంటున్నారు. తెల్లజుట్టు కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే హెయిర్ డై తెచ్చుకుని వాడుతుంటారు. రసాయనాలు ఉండటం మూలాన వీటిని ఎక్కువగా వాడితే జుట్టు డ్యామేజ్ అవుతుంది. భవిష్యత్తులో మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. మార్కెట్లో హెయిర్ డై కు బదులుగా ఇంట్లోనే ఈజీగా హెయిర్ డై చేసుకుని వాడచ్చు. దీన్నెలా తయారు చెయ్యాలో.. ఎలా వాడాలో తెలుసుకుంటే..

ఇంట్లోనే సహజంగా హెయిర్ డై తయారుచేయడానికి కొబ్బరి పీచు అవసరం. ప్రతి ఇంట్లో దేవుడికి కొబ్బరికాయ కొట్టడానికి ముందు కొబ్బరికాయ పీచు తీస్తారు. దీంటో హెయిర్ డై తయారుచేయవచ్చు.

ఇది కూడా చదవండి: బోర్లా పడుకునే అలవాటుందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?


హెయిర్ డై తయారుచేయడానికి కావలసిన పదార్థాలు..

కొబ్బరిపీచు.. గుప్పెడు

కొబ్బరినూనె.. 1టేబుల్ స్పూన్

అలోవెరా జెల్.. 1టీ స్పూన్

తయారుచేసే విధానం..

మొదట కొబ్బరి పీచును శుభ్రం చేసుకోవాలి. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టౌ మీద ఇనుప బాండీ ఉంచి అందులో కొబ్బరి పీచు ముక్కలు వేయాలి. సన్నని మంట మీద సుమారు 30నిమిషాలు వేయించాలి. 30నిమిషాలకు కొబ్బరిపీచు నల్లగా మారుతుంది. దీన్ని చేత్తో నలిపితే బూడిదలాగా అయిపోతుంది. ఇది చాలా మృదువుగా ఉండటం కోసం కొద్దిగా నూరుకోవచ్చు. మెత్తగా ఉన్న ఈ కొబ్బరిపీచు పౌడర్ లోకి స్పూన్ కొబ్బరి నూనె, స్పూన్ అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. 10నిమిషాల పాటూ దీన్ని ఒకవైపు ఉంచాలి. మిశ్రమం మొత్తం బాగా కలిసి మంచి హెయిర్ డై గా తయారవుతుంది.

ఇది కూడా చదవండి: ఆరోగ్యానికి మంచిది కదా అని బీట్రూట్ ఎక్కువగా తింటే జరిగేదిదే..!


హెయిర్ డై అప్లై చేసే విధానం..

ఈ హెయిర్ డైని మార్కెట్లో దొరికే హెయిర్ డై లా బ్రష్ సహాయంతో అప్లై చేయవచ్చు. పొడి జుట్టుకు మూలాల నుండి బాగా పట్టించి సుమారు అరగంట సేపు అలాగే వదిలేయాలి. అరగంట తరువాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు మూలాల నుండి సహజంగా నల్లగా మారుతుంది.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 04 , 2024 | 03:22 PM