Share News

Hair Fall: రాత్రిపూట చేసే ఈ 3 తప్పుల వల్లే హెయిర్ ఫాల్ అధికంగా ఉంటుంది.. అవేంటంటే..!

ABN , Publish Date - Feb 19 , 2024 | 02:01 PM

జుట్టు రాలే సమస్యకు రాత్రి సమయంలో చేసే మూడు తప్పులే ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

Hair Fall: రాత్రిపూట చేసే ఈ 3 తప్పుల వల్లే హెయిర్ ఫాల్ అధికంగా ఉంటుంది.. అవేంటంటే..!

ఇప్పటికాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చిన్న పెద్దా తేడా లేకుండా ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. జుట్టు బలహీనంగా మారడం, జుట్టు తెల్లబడటం, చిట్లిపోవడం, నిర్జీవంగా మారడం ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. వీటిలో అధికశాతం మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలే సమస్య ఎక్కువైతే అది క్రమంగా బట్టతలకు దారితీస్తుంది. మహిళలలో జుట్టు బాగా రాలిపోయి తల చర్మం కనబడుతూ ఉంటుంది. ఈ సమస్యకు రాత్రి సమయంలో మహిళలు చేసే మూడు తప్పులే ప్రధాన కారణం అని తేలింది. ఆ తప్పులేంటో తెలుసుకుంటే..

దిండు కవర్..

దిండు కవర్ రకం కూడా జుట్టును ప్రభావితం చేస్తుంది. గరుకుగా లేదా మురికిగా ఉన్న దిండు కవర్‌పై తల పెట్టుకుని నిద్రిస్తే రాపిడి కారణంగా జుట్టు విరిగిపోతుంది. సిల్క్ లేదా మస్లిన్ క్లాత్‌తో తయారు చేసిన దిండు కవర్‌పై తల పెట్టుకుని పడుకోవడం వల్ల ఘర్షణ జరగదు. జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది. కాబట్టి దిండు కవర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ఇది కూడా చదవండి: Health Tips: ఈ 4 మొక్కలను ఇంట్లో పెంచుకుంటే చాలు.. ఎన్ని లాభాలుంటాయంటే..!



జుట్టు వదులుగా..

చాలామంది రాత్రిపూట జుట్టు బాగా బిగుతుగా బిగించి జడ వేసుకోవడం లేదా జుట్టు గట్టిగా కట్టుకుని నిద్రపోవడం చేస్తుంటారు. ఇలా చేస్తే జుట్టు రాలిపోయే సమస్య అధికం అవుతుంది. జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ సరిగా అందదు. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతుంటే జుట్టును బిగించి నిద్రపోవడం మానేయాలి.

తడి జుట్టుతో నిద్ర..

చాలామంది అలసట తీరాలని, ట్రాఫిక్, దుమ్ము, ధూళి వదలాలని రాత్రిపూట తలస్నానం చేస్తుంటారు. అయితే రాత్రిపూట తలస్నానం చేసిన తరువాత తల బాగా ఆరకముందే నిద్రపోతే జుట్టు రాలే సమస్య అధికం అవుతుంది. తడిజుట్టుతో నిద్రించడం వల్ల కేవలం జుట్టు రాలడమే కాకుండా ఇతర జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.

జుట్టు రాలకూడదంటే..

పడుకునే ముందు వారానికి ఒకటి లేదా రెండు సార్లు నూనెతో జుట్టుకు మసాజ్ చేసుకోవాలి. జుట్టు విపరీతంగా పొడిగా ఉంటే నిద్రపోయే ముందు కొబ్బరినూనె రాయాలి.

జుట్టు దువ్వుకున్న తర్వాత నిద్రపోతే జుట్టు చిక్కు పడదు. అదేవిధంగా పడుకున్నప్పుడు దిండు లేదా దుప్పటికి చుట్టుకోవడం, ఇరుక్కోవడం వంటి సమస్యలు కూడా రావు.

బిగుతుగా ఉండే రబ్బరు బ్యాండ్‌ని ఉపయోగించకుండా సిల్క్ లేదా శాటిన్ స్క్రాంచీతో జుట్టును కట్టుకోవచ్చు. స్క్రాంచీ మృదువుగా ఉంటుంది కాబట్టి జుట్టుకు ఎలాంటి నష్టం కలిగించదు.

ఇది కూడా చదవండి: మనచుట్టూ ఉండే అత్యంత విషపూరితమైన మొక్కలివీ..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 19 , 2024 | 02:02 PM