Share News

Highest Land Owner: భారతదేశంలో ప్రభుత్వం తర్వాత అత్యధిక భూములు ఎవరికి ఉన్నాయో తెలిస్తే షాకవుతారు..

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:16 PM

ప్రభుత్వం తర్వాత వక్ఫ్ బోర్డు వద్ద అత్యధిక భూములు ఉన్నాయనే భావన ఉంది. కానీ అసలు నిజం ఇదీ..

Highest Land Owner: భారతదేశంలో ప్రభుత్వం తర్వాత అత్యధిక భూములు ఎవరికి ఉన్నాయో తెలిస్తే షాకవుతారు..

ఆస్తిగా భూమికి ఉన్న విలువ అసామాన్యమైనది. సామాన్య వ్యక్తిని సైతం రైతుగా, రాజుగా నిలబెట్టగలదు. మరి అసమానమైన విలువ కలిగిన ఈ భూమి మనదేశంలో భారత ప్రభుత్వం తర్వాత ఎవరి వద్ద ఎక్కువగా ఉంది? అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ప్రభుత్వం తర్వాత వక్ఫ్ బోర్డు వద్ద అత్యధిక భూములు ఉన్నాయనే భావన ఉంది. కానీ ‘కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా’ బోర్డు వద్ద ఎక్కువ భూమి ఉందని భూగణాంకాలకు సంబంధించిన వెబ్‌సైట్ డేటా చెబుతోంది. ఫిబ్రవరి 2021 నాటికి భారత ప్రభుత్వం వద్ద సుమారు 15,531 చదరపు కిలోమీటర్ల భూమి ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత అత్యధికంగా ‘కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా బోర్డు’ వద్ద 7 కోట్ల హెక్టార్ల (17.29 కోట్ల ఎకరాలు) భూమి ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ భూములు చర్చిలు, కాలేజీలు, స్కూళ్లతో పాటు అనేక భవనాలకు నిలయాలుగా ఉన్నాయి. వీటి ప్రస్తుత విలువ సుమారు రూ.20,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనాగా ఉంది.

church.jpg


1947కి ముందు భారతదేశంలోని చాలా భూములను బ్రిటీష్ ప్రభుత్వం కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా బోర్డుకు ఇచ్చింది. 1927లో ఇండియన్ చర్చ్ చట్టం ద్వారా వీటిని కాథలిక్ చర్చ్‌కి అందించింది. దీంతో కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా బోర్డుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. 2012 నాటికి ఇండియాలో 2,457 హాస్పిటల్ డిస్పెన్సరీలు, 240 వైద్య లేదా నర్సింగ్ కళాశాలలు, 28 సాధారణ కళాశాలలు, 5 ఇంజనీరింగ్ కళాశాలలు, 3,765 మాధ్యమిక పాఠశాలలు, 7,319 ప్రాథమిక పాఠశాలలు, 3,187 నర్సరీ పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా బోర్డు కిందకు వస్తాయి. కాగా బ్రిటీష్ ప్రభుత్వం లీజుకు ఇచ్చిన ఏ భూమినీ అధికారికంగా గుర్తించబోమని 1965లో భారత ప్రభుత్వం ఒక సర్క్యూలర్ జారీ చేసింది. అయినప్పటికీ ఈ భూముల చట్టబద్ధతపై వివాదం ఇంకా పరిష్కారం కాకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 01:17 PM