Share News

Homemade Hair Dye: తెల్లజుట్టును 2నెలలపాటూ నల్లగా ఉంచే హెయిర్ డై.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు..!

ABN , Publish Date - Mar 28 , 2024 | 03:42 PM

ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకునే ఈ హెయిర్ డై తో తెల్ల జుట్టును ఏకంగా 2నెలల పాటూ కవర్ చేయవచ్చు

Homemade  Hair Dye: తెల్లజుట్టును 2నెలలపాటూ నల్లగా ఉంచే హెయిర్ డై.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు..!

ఈ మధ్యకాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు చాలా పెరుగుతున్నాయి. చిన్న వయసు వారిలో కూడా తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. తెల్లజుట్టు బయటకు కనిపించాలని ఎవరూ అనుకోరు. దీన్ని కవర్ చేయడానికి మార్కెట్లో లభించే బోలెడు రకాల హెయిర్ డై లు ఉపయోగిస్తుంటారు. కానీ ఇవన్నీ రసాయనాలతో తయారైనవి, పైపెచ్చు హెయిర్ డై వేసుకున్న 15రోజుల్లోనే మళ్లీ తెల్లగా కనిపిస్తుంటుంది. అంతేనా వీటి వల్ల భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు వస్తాయి. అయితే ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకునే హెయిర్ డై తో తెల్ల జుట్టును ఏకంగా 2నెలల పాటూ కవర్ చేయవచ్చు. ఈ హెయిర్ డై ఎలా చేయాలో.. కావలసిన పదార్థాలేంటో పూర్తీ తెలుసుకుంటే..

హెయిర్ డై..

జుట్టు నల్లబడాలంటే గోరింట, నీలిమందు కలిపి తలకు పట్టించాలి. ఈ హెయిర్ డై తయారీకి హెన్నా, పెరుగు, నీరు, ఇండిగో పౌడర్ అవసరం. పెరుగు, గోరింటను ఒక పాత్రలో తీసుకుని మిక్స్ చేయాలి. తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను రాత్రంతా మూతపెట్టి ఉంచాలి. మరుసటి రోజు ఉదయం, కలిపి ఉంచిన హెన్నాలోకి సమాన పరిమాణంలో ఇండిగో పౌడర్ వేసి కొద్దిగా వేయాలి. బాగా కలిపిన తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 2 గంటలపాటు ఉంచి తర్వాత కడిగి శుభ్రం చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: కింగ్ కోబ్రా vs రస్సెల్ వైపర్.. ఏది ఎక్కువ విషపూరితమంటే..


ఈ హెయిర్ డైని అప్లై చేసి తల వాష్ చేసుకున్న తరువాత 24 గంటల వరకు జుట్టును షాంపూతో లేదా కండీషనర్‌తో కడగకూడదు. ఇలా చేస్తే జుట్టు రంగు చాలా దట్టంగా నల్లగా కనిపిస్తుంది.

ఇవి కూడా బెస్టే..

తెల్ల జుట్టు మీద బ్లాక్ టీ వాటర్ ను రెగ్యులర్ గా అప్లై చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. దీని కోసం ఒక కప్పు నీటిలో 3 చెంచాల బ్లాక్ టీ ఆకులు వేసి ఉడికించాలి. నీరు చల్లబడిన తరువాత జుట్టు కడగడానికి దీన్ని ఉపయోగించాలి. దీన్ని జుట్టు మీద స్ప్రే చేసి అరగంట పాటు అలాగే ఉంచవచ్చు కూడా.

కరివేపాకు, కొబ్బరి నూనెను వారానికి 2 నుండి 3 సార్లు జుట్టుకు రాసుకుంటే జుట్టు సహజంగా నల్లగా మారుతుంది. కొన్ని కరివేపాకులను తీసుకుని వాటిని అరకప్పు కొబ్బరి నూనెలో వేసి ఉడికించాలి. ఈ నూనెను రాత్రంతా తలకు పట్టించి మరుసటిరోజు కడిగేయవచ్చు. ఇది మూలాల నుండి జుట్టు నల్లబడటానికి సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 28 , 2024 | 03:42 PM