Viral: స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్.. ప్యాకెట్ విప్పి చూస్తే..
ABN , Publish Date - Jun 24 , 2024 | 08:47 PM
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ సేవల్లో లోపాలు తరచూ దేశంలో ఎక్కడో చోట వెలుగు చూస్తున్నాయి. తాజాగా స్విగ్గీలో ఫుడ్ ఆర్డరిచ్చిన ఇద్దరు హైదరాబాదీలకు చేదు అనుభవం ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలకు సంబంధించిన సేవాలోపాలు తరచూ దేశంలో ఎక్కడో చోట వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డరిచ్చిన ఇద్దరు హైదరాబాదీలకు చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగిందీ చెబుతూ వారు పెట్టిన పోస్టులు నెట్టింట హాట్ టాపిక్‌గా (Viral) మారాయి.
సాయితేజ అనే వ్యక్తి కూకట్ పల్లిలోని ఓ రెస్టారెంట్ నుంచి స్విగ్గీ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డరిస్తే అందులో పురుగు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలతో పాటు ఆర్డర్ ఐడీ, ఇతర వివరాలను అతడు నెట్టింట షేర్ చేశారు. ఈ పోస్టుకు అవినాశ్ అనే వ్యక్తి స్పందిస్తూ తాను పనీర్ బిర్యానీ ఆర్డరిస్తే అందులో ఎముక కనిపించిందని వాపోయాడు.
Viral: 10 నెలల్లో 23 కేజీలు తగ్గిన వ్యాపారి! అతడి టెక్నిక్ నెట్టింట వైరల్!
ఘటనపై స్పందించిన స్విగ్గీ వారికి క్షమాపణలు చెప్పింది. తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు, సాయితేజ్ స్పందిస్తూ తనకు స్విగ్గీ ఫుల్ రీఫండ్ ఇచ్చిందని అన్నాడు. ఎఫ్‌ఎస్ఎస్ఏకి కూడా సదరు రెస్టారెంట్‌పై ఫిర్యాదు చేయాలని సూచించారు.
మరోవైపు, నెటిజన్లు కూడా ఈ ఘటనలపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆహార నాణ్యతను పాటించని రెస్టారెంట్లపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పదే పదే వెలుగు చూడటం విచారకరమని వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఉదంతం ట్రెండింగ్ లో కొనసాగుతోంది.