Viral: నా సంస్థలోని తొలి ఉద్యోగిని తీసేశానంటూ సీఈఓ పోస్టు! నెట్టింట విమర్శలు
ABN , Publish Date - Jun 22 , 2024 | 08:46 PM
తన తొలి ఉద్యోగిని జాబ్ నుంచి తీసేశానంటూ ఓ సంస్థ సీఈఓ చిరునవ్వుతో ప్రకటించడంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం మానవత్వం లేకపోతే ఎలా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లేఆఫ్స్ విషయంలో జాగ్రత్త వహించకపోతే సంస్థలు అప్రదిష్ఠ మూటకట్టుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియా జమానాలో ఈ విషయమై మరింత శ్రద్ధ వహించాలి. ఇవేమీ పట్టించుకోకుండా కనీసం మానత్వం లేకుండా తన సంస్థలోని తొలి ఉద్యోగిని తొలగించానంటూ సీఈఓ నెట్టింట పెట్టిన పోస్టుపై (Viral) ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Viral: పని చేయకున్నా 20 ఏళ్ల పాటు శాలరీ! అవమాన భారంతో కంపెనీపై ఉద్యోగి కేసు
తన సంస్థలో తొలి ఉద్యోగిని తొలగించే క్రమంలో నేను నేర్చుకున్నది ఇదేనంటూ ఓ అమెరికా సంస్థ సీఈఓ మాథ్యూ బాల్ట్‌జెల్ లింక్డిన్‌లో పోస్టు పెట్టారు. పది నిమిషాల పాటు అతడితో సమావేశమై ఉద్యోగం నుంచి తొలగించానని చెప్పారు. ఇలాంటి తొలగింపులతో సంస్థలోని సంస్కృతి ప్రభావితమవుతుందని, చెప్పారు. అందుకే తాను విషయాన్ని సూటిగా డీల్ చేశానని చెప్పాడు. ఆ మాజీ ఉద్యోగి నెంబర్ కూడా మిగతా ఉద్యోగులకు ఇచ్చి అతడితో మాట్లాడమన్నానని చెప్పారు. ఏదీ దాచలేదని చెప్పుకొచ్చాడు. తాను నవ్వుతూ ఉన్న ఫొటోను కూడా జత చేశాడు (I Fired My First Employee CEOs Smiling Photo On LinkedIn Sparks Backlash).
అయితే, బాల్ట్‌జెల్ పోస్టుపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. తొలి నుంచి పనిచేస్తున్న ఉద్యోగిని ఇలా పది నిమిషాలలో కనీసం మానత్వం ప్రదర్శించకుండా జాబ్ లోంచి తీసేయడం దారుణమని అనేక మంది కామెంట్ చేశారు. ఇలాంటి సంస్థల్లో అస్సలు పని చేయకూడదని అన్నారు. చేసిన పని గురించి గర్వంగా ప్రకటించుకోవడం హేయమైన చర్య అని విమర్శించారు. ఒకసారి ఇలా అలవాటైతే ఎందరి జీవితాలు తలకిందులవుతాయో లెక్కేలేదన్నారు.