IQ Test: మీ ఐక్యూ ఏ స్థాయిలో ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ ముగ్గురిలో బాస్ ఎవరో కనిపెట్టండి..
ABN , Publish Date - Sep 28 , 2024 | 08:18 AM
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.
తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఒక ఆఫీస్ సీన్ కనిపిస్తోంది. ఆఫీస్ రూమ్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒకరు కుర్చీలో కూర్చుని ఉండగా, మరో ఇద్దరు నిల్చుని మాట్లాడుతున్నారు. ఆ ముగ్గురిలో బాస్ ఎవరో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 5 సెకెన్ల వ్యవధిలో ఆ ముగ్గురిలో బాస్ ఎవరో కనిపెడితే మీ బ్రెయిన్ చాలా స్పీడ్‌గా పని చేస్తున్నట్టు లెక్క. చాలా తక్కువ మందే 5 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. బ్లాక్ ఫ్యాంట్, వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి బ్లేజర్.. బాస్ కూర్చునే కుర్చీకి తగిలించి ఉంది. కాబట్టి అతడే బాస్.
ఇవి కూడా చదవండి..
Viral Video: నడిరోడ్డుపై లో దుస్తులతో వాకింగ్.. రీల్ కోసం ఓ యువతి పిచ్చి పని.. వార్నింగ్ రావడంతో..
Viral Video: తెలివంటే ఇదీ.. బైక్ ఇంజిన్, ఫ్యాన్‌తో వినూత్న వాహనం.. గాల్లోకి ఎగిరే చౌకైన విహంగం..
Viral Video: వావ్.. హిప్పోలు కూడా ఇంత బుద్ధిగా ఉంటాయా? పళ్లు తోముతుంటే హిప్పో ఏం చేసిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.