Viral Video: వానర సైన్యం దెబ్బకు.. చిరుత ఎలా పరుగు తీసిందో..
ABN , Publish Date - May 14 , 2024 | 06:54 PM
మనుషుల్లో లేనిది.. జంతువులు, పశు పక్షాదుల్లో ఉన్నది ఏమిటంటే.. ఐకమత్యం. కాకులు నుంచి కోతుల (వానరులు) వరకు వాటి ఐకమత్యం ఎప్పుడో అప్పుడు.. ఎక్కడో అక్కడ మనకు కనిపిస్తునే ఉంటాయి.
మనుషుల్లో లేనిది.. జంతువులు, పశు పక్షాదుల్లో ఉన్నది ఏమిటంటే.. ఐకమత్యం. కాకులు నుంచి కోతుల (వానరులు) వరకు వాటి ఐకమత్యం ఎప్పుడో అప్పుడు.. ఎక్కడో అక్కడ మనకు కనిపిస్తునే ఉంటాయి. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే ఒక కాకి చనిపోతే.. వందలాది కాకులు అక్కడికి చేరి.. కావ్ కావ్ మంటూ అరుస్తాయి.
అలాగే కోతులు సైతం ఒక కోతికి ఇబ్బంది కలిగితే.. మిగిలిన కోతులన్నీ.. ఆ కోతికి బాసటగా నిలుస్తాయి. అందుకు తాజా ఉదాహరణ ఈ వీడియో. రహధారిపై కోతులు గుంపు స్వేచ్చగా తిరుగుతున్నాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన చిరుత.. తనకు ఆహారం దొరికిందని సంబర పడింది.
దాంతో ఒక్క ఉదుటున కోతులపై చిరుత ఉరికి... ఒక కోతిని పట్టుకుంది. అంతే ఊహించని ఈ పరిణామానికి కోతులన్నీ.. ఒక్క సారిగా ఆ చిరుత వైపునకు పరుగు తీశాయి. దీంతో ఆ వానర సైన్యాన్ని చూసి చిరుత.. ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఏం చేయాలో పాలు పోక ఆ కోతిని వదిలి.. చిరుత ప్రాణ భయంతో పరుగు లంకించుకొంది.
ఆ చిరుతను పట్టుకొనేందుకు కోతులన్నీ వేగంగా దౌడు తీశాయి. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఘటన దక్షిణాఫ్రికాలో గతంలో జరిగినట్లు తెలుస్తుంది. అయితే కోతులు గుంపు రహధారులపై తిరుగుతుండడంతో.. వాహనదారులు తమ వాహనాలను పక్కన ఆపి.. సరదాగా వీడియో తీస్తుండగా.. కోతులపై చిరుత దాడి చేసింది. ఈ వీడియో పాతదే అయినా.. సోషల్ మీడియాలో నేటికి హాల్‌చల్ చేస్తుంది.
ఈ వీడియో @AMAZlNGNATURE అనే ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియోను నేటికి 18.3 మిలియన్ల మంది వీక్షించారు. అలాగే ఈ వీడియోకి 1,27000 మందికిపైగా లైక్ చేశారు.
ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వానరుడి నుంచి నరుడు వచ్చినా.. ఆ వానరంలో ఉన్న ఐక్యతను మాత్రం నరుడు మరిచి పోయారంటూ ఓ చర్చ అయితే వైరల్ అవుతుంది.
Read Latest National News And Telugu News