Share News

Viral: షాప్‌లో పని చేసేందుకు హెల్పర్ కావలెను.. జీతం ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

ABN , Publish Date - Apr 10 , 2024 | 02:10 PM

కాలేజీ చదువు పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి మంచి ప్యాకేజీతో వీలైనంత త్వరగా ఉద్యోగం సంపాదించాలని ఆశపడతాడు. కానీ కోరుకున్న ఉద్యోదం, మంచి జీతం దక్కించుకునే వారు చాలా తక్కువే ఉంటారు. మిగిలిన వాళ్లు తమకు వచ్చిన ఉద్యోగంతో, తక్కువ జీతంతో సర్దుకుంటూ బతకాల్సిన పరిస్థితి.

Viral: షాప్‌లో పని చేసేందుకు హెల్పర్ కావలెను.. జీతం ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

కాలేజీ చదువు పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి (Student) మంచి ప్యాకేజీతో వీలైనంత త్వరగా ఉద్యోగం సంపాదించాలని ఆశపడతాడు. కానీ కోరుకున్న ఉద్యోదం, మంచి జీతం (Salary) దక్కించుకునే వారు చాలా తక్కువే ఉంటారు. మిగిలిన వాళ్లు తమకు వచ్చిన ఉద్యోగంతో, తక్కువ జీతంతో సర్దుకుంటూ బతకాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఉద్యోగ ప్రకటన చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ యాడ్‌పై చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు (Viral News).


అమృతా సింగ్ అనే ట్విటర్ యూజర్ చేసిన పోస్ట్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఓ మోమో షాప్‌లో పని చేయడానికి హెల్పర్ కావాలనే ఓ యాడ్‌కు సంబంధించిన ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. అయితే అందులో ఆశ్చర్యపరిచేది ఏంటంటే.. ఆ హెల్పర్‌కు ఓనర్ ఆఫర్ చేసిన జీతం. నెలకు రూ.25 వేలు ఇస్తామని ఆ ఓనర్ ప్రకటించాడు. ``హే, ఈ స్థానిక మోమో షాప్ భారతదేశంలోని సగటు కళాశాల కంటే మెరుగైన ప్యాకేజీలను అందిస్తోంది`` అంటూ అమృత కామెంట్ చేశారు (Helper in Momo Shop).


ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది గంటల్లోనే దాదాపు 90 వేల మంది ఈ పోస్ట్‌ను వీక్షించారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ``ఇప్పుడే అప్లయ్ చేస్తున్నా``, ``మా ఏరియాలో ప్లంబర్ నెలకు రూ.50 వేలు సంపాదిస్తున్నాడు``, ``జీతంతో పాటు ప్రతిరోజూ మోమోలు కూడా ఫ్రీ``, ``ఆ జీతం నెలకా? సంవత్సరానికా?``, ``ఆ షాప్ అడ్రస్ ఎక్కడో చెప్పండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Hyderabad: ముంబై, బెంగళూరు కంటే హైదరాబాద్ ఉత్తమం.. యువతి చెప్పిన 5 కారణాలపై నెటిజన్ల స్పందన ఏంటంటే..


Puzzle: మీ కళ్లు ఎంత షార్ప్‌గా ఉన్నాయో టెస్ట్ చేసుకోండి.. ఈ ఫొటోలోని పిల్లిని 7 సెకెన్లలో కనిపెట్టండి..!

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 02:10 PM