Airport food prices: ఎయిర్ పోర్టుల్లో ఇవేం దారుణాలు.. ప్రయాణికుడి ఆవేదన నెట్టింట వైరల్
ABN , Publish Date - Jan 01 , 2024 | 07:34 PM
ఎయిర్‌పోర్టులో ఆహార ధరలు చూసి అవాక్కైన ఓ వ్యక్తి నెట్టింట ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ రేట్లు చూస్తుంటే పట్టపగలే దోపిడీ జరుగుతున్నట్టు ఉందని కామెంట్ చేశాడు. సాధారణ రాజ్మాచావల్ కోసం తాను రూ.500 చెల్లించానని వాపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రయాణ సాధనాలన్నిటిలోకి అత్యంత సౌకర్యవంతమైనది విమానమే. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండే విమానాలు ప్రస్తుతం మధ్యతరగతి వారికీ అందుబాటులోకి వచ్చాయి. అయితే, విమానాశ్రయాల్లోని ఆహారపదార్థాల ధరలు మాత్రం ఎటువంటి వారైనా దిమ్మెరపోయేలా చేస్తుంటాయి. తాజాగా ఓ ప్రయాణికుడు ఇలాగే షాక్ తిన్నాడు. తన ఆవేదనను నెట్టింట పంచుకున్నాడు.
Viral: ఉడతకు ఇన్ని తెలివితేటలా! టూరిస్ట్ కనిపించగానే అతడి వద్దకు వచ్చి ఏం చేసిందో చూస్తే..
ఎయిర్ పోర్టుల్లో ఇలాంటి దోపిడీ ఎందుకు జరుగుతోందో తనకు ఎప్పుడూ అర్థంకాలేదని సంజయ్ అరోరా వాపోయారు. ‘‘సాధారణ రాజ్మా చావల్‌కు కోసం రూ.500 చెల్లించా. ఇది పట్టపగలే దోపిడీలా ఉంది. విమానాల్లో ప్రయాణిస్తున్నంత మాత్రాన జనాల నుంచి మరీ ఇలా డబ్బులు దోచేయాలా?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఇది ఏ ఎయిర్‌పోర్టులో జరిగిందో మాత్రం చెప్పలేదు (Flier complains about selling rs 500 for rajma chawal).
Viral: ఈ కుర్రాడు స్విగ్గీకే ఝలక్ ఇద్దామనుకున్నాడు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు!
సంజయ్ ట్వీట్లకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అనేక మంది ఎయిర్‌పోర్టులో ఆహార పదార్థాల రేట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తామూ ఇలాగే చాలా సార్లు ఫీలయ్యామని వాపోయారు. ఒకసారి తాను చిన్న కప్పు టీ కోసం రూ.300 చెల్లించాల్సి వచ్చిందని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఎయిర్ పోర్టులో అధిక ధరల వెనక కారణాలను మరో నెటిజన్ వివరించాడు. ‘‘ఎయిర్ పోర్టు నిర్మించేందుకు చాలా ఖర్చవుతుంది. ఎయిర్‌పోర్టులోని షాపుల అద్దెలు ఎక్కువగా ఉంటాయి. భద్రతా ప్రమాణాలు అధికంగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో సిబ్బందిని నియమకం, జీతాల ఖర్చులూ ఎక్కువగా ఉంటాయి. అందుకే అక్కడి ఆహారం రేట్లలో ఇవన్నీ ప్రతిబింబిస్తాయి’’ అని అతడు వివరించాడు.
Viral: వామ్మో.. గాడిద కోపం ఇంత భయంకరమా? ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా?
Viral: ఈ కుర్రాడు స్విగ్గీకే ఝలక్ ఇద్దామనుకున్నాడు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు!
Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!